Woman made to parade naked for not working well in pakistan

pregnant Christian woman, Pakistan, paraded naked, Sheikhupura district, Punjab Province, Anti-Terrorism Act, Pak women, Pakistan Christians, violence against women

Woman made to parade naked for not working well in Pakistan

పాకిస్థాన్ లో దారుణం.. క్రైస్తవ మహిళ నగ్నం ఊరేగింపు..

Posted: 11/26/2014 09:02 AM IST
Woman made to parade naked for not working well in pakistan


పాకిస్థాన్ లో దారుణం జరిగింది. రెండు నెలల గర్భిణీ స్త్రీపై యజమాని కొడుకు అతని నలుగురు మిత్రలు దారుణానికి ఒడిగట్టారు. యజమాని అంచనాలకు తగినట్లుగా పనిచేయలేదనే ఆరోపణలపై.28 ఏళ్ల క్రైస్తవ మహిళను నగ్నంగా వూరేగించారు. సుమారు అరగంట పాటు తనను గ్రామంలో నగ్నంగా పూరేగించారని భాదితురాలు తెలిపింది. పాకిస్థాన్‌లోని పంజాబ్ రాష్ట్రంలో షేక్‌పురా జిల్లా రానా పట్టణంలో క్రైస్తవ కాలనీ నివాసిపై అటవికంగా దారుణ అకృత్యానికి పాల్పడ్డారు. యజమాని కుమారుడు, మరో నలుగురు కలిసి తనను వీధిలోకి ఈడ్చుకోచ్చారని, అక్కడ అమె బట్టలను చింపి వివస్త్రను చేశారని బాధితురాలు తన అక్రంధనను వెళ్లగక్కింది.

అరగంట పాటు తనను వీధి గుండా తరముకుంటూ నడిపించిన వారిని వీధి చివర ఓ వృద్దురాలు అడ్డుకోవడంతో వారు వెనుదిరిగారని చెప్పింది. అమె తనకు బట్టలు ఇచ్చిందని తెలిపింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితురాలిని అస్పత్రిలో చేర్పించారు. యజమాని కోడుకు అతని స్నేహితుల వికృత చర్యల వల్ల తన గర్భాన్ని కోల్పోయినట్లు బాధితురాలు తెలిపింది. అయితే పోలీసులు మాత్రం నిందితులపై చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారని తెలిపింది. నిందితులపై పోలీసులు చర్యలు తీనుకోని పక్షంలో తాను ఆత్మహత్యకు పాల్పడతానని బాధితురాలు హెచ్చరించింది. కాగా పోలీసులు వైద్య నివేదిక తరువాత నిందితులపై కేసు నమోదు చేశారని, అయితే  ఉగ్రవాద వ్యతిరేక చట్టం కింద కాకుండా.. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారని బాధితురాలి భర్త తెలిపాడు.

అటవికంగా అడవారిపై వికృత చర్యలకు పాల్పడిన మొబిన్ గొండాల్ అతని నలుగురు మిత్రులపై పాకిస్థాన్ పీనల్ కోడ్ ప్రకారం పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు రానా పట్టణం పోలీస్ అధికారి మహ్మద్ ఖాన్ తెలిపారు. తన భార్యను నగ్నంగా ఊరేగించారన్న బాధితురాలి పిర్యాదుపై కేసు నమోదు  చేశామని నిందితులను అరెస్టు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. నిందితులను అరెస్టు చేయని పక్షంలో ఈ ఘటనను నిరసిస్తూ.. పట్టణంలో నిరసన కార్యక్రమాలు చేపడతామని క్రైస్తవ మతపెద్ద, మానవ హక్కుల సంఘం అధ్యక్షుడు అస్లాం సహోత్రా హెచ్చరించారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles