Woman demands her husband to construct a toilet at bihar state

Toilet construction, Patna, Police station, Woman, corperator, parents house, left husband, Bikram village, quarrel

woman demands her husband to construct a toilet at bihar state

దాని కోసం మొగుణ్ణి వదిలేసింది.. వుట్టింటికి వెళ్లింది..!

Posted: 11/23/2014 06:17 PM IST
Woman demands her husband to construct a toilet at bihar state

మరుగుదొడ్డి నిర్మాణం కోసం మంగళసూత్రాన్ని అమ్మివేసిన ఓ మహిళ ఇటీవల వార్తల్లోకెక్కింది. తాజాగా బీహార్‌లో టాయిలెట్ కట్టిస్తేనే కాపురానికి వస్తానంటూ ఓ నవ వదువు పుట్టింటికి వెళ్లిపోయింది. పాట్నా జిల్లాలో ఈ ఉదంతం చోటుచేసుకుంది. బిక్రమ్ గ్రామానికి చెందిన కార్పెంటర్ రాకేశ్ శర్మతో బాబ్లీ దేవి(20)కి గతేడాది వివాహం అయింది. ఇంటి వద్ద టాయిలెట్ కట్టించాలంటూ కాపురానికి వచ్చినప్పుడు ఆమె కోరగా అందుకు అంగీకరించిన రాకేశ్ తర్వాత పట్టించుకోలేదు. చివరికి మరుగుదొడ్డి నిర్మాణానికి తిరస్కరించాడు.

వాగ్వాదం జరగడంతో ఆమెను కొట్టాడు. దీంతో విసిగిపోయిన బాబ్లీ దేవి ఇక లాభం లేదనుకుని పెట్టేబేడా సర్దుకుని పుట్టింటికి బయలుదేరి వెళ్లింది. పనిలోపనిగా తన భర్త మరుగుదొడ్డిని కట్టించేలా చూడాలని కోరుతూ పాట్నా పోలీసు స్టేషన్‌లో  ఫిర్యాదు కూడా చేసింది. మరుగుదొడ్డి కట్టేదాకా ఆ ఇంటికి వచ్చేదేలేదంటూ స్పష్టం చేసింది. ‘బహిర్భూమికి వెళ్లడం మహిళకు సిగ్గుచేటు. ఇది ఆరోగ్యం, గౌరవం, హుందాతనానికి సంబంధించిన విషయం’ అని బాబ్లీ దేవి చెప్పింది. ఇప్పటికైనా రాకేశ్ శర్మ మరుగుదోడ్డి నిర్మించడంపై దృష్టిసారిస్తాడో లేదో.. వేచి చూడాలి.

జి, మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles