Iit b develops membrane that will decrease dialysis cost by 50 percent

Scientists, Indian Institute of Technology, Bombay (IIT-B), membrane, dialysis, reduce cost, decrease, process time, 50 percent, Chemical engineering researchers, hollow-fibre membrane, pre-clinical trials, laboratory tests, faster, efficient dialysis, less side affects

IIT-B develops Membrane that will decrease Dialysis cost by 50 percent

సరికొత్త మెంబ్రేన్‌తో 50శాతం తగ్గిన డయాలసిస్ ఖర్చు

Posted: 11/22/2014 11:15 AM IST
Iit b develops membrane that will decrease dialysis cost by 50 percent


కిడ్నీలు చెడిపోయి డయాలసిస్ పై ఆధారపడిన పేషంట్లకు ఓ విధంగా ఇది శుభవార్తే. డయాలసిస్ భాధ ఎలా వుంటుందో.. చెప్పడం కష్టం. అంతేకాదు సుమారు మూడు నాలుగు గంటల పాటు కదలకుండా బెడ్ పై పడుకుని.. డయాలసిస్ చేయించుకోవడం ఎంత భాతను అనుభవించాల్సి వస్తుందో మాటల్లో చెప్పలేం. అయితే వీరి బాధను అర్థం చేసుకున్న ఐఐటీ బాంబే విద్యార్థులు సరికొత్త అవిష్కరణకు శ్రీకారం చుట్టారు. డయాలసిస్ రోగులకు బాధ తో పాటు డబ్బును, సమయాన్ని కూడా ఈ నూతన అవిష్కరణతో ఆదా అవుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

డయాలసిస్‌ ఖర్చును సగానికి సగం తగ్గించే ప్రత్యేకమైన మెంబ్రేన్‌(పొర)ను ఐఐ టీ-బాంబే కెమికల్‌ ఇంజనీరింగ్‌ విద్యార్థులు అభివృద్ధి చేశారు. దీంతో డయాలసిస్‌కు పట్టే సమయం కూడా యాభై శాతం మేర తగ్గుతుంది. ప్రస్తుత విధానం కన్నా ఇది మరింత సురక్షితం కూడా అని చెబుతున్నారు వైద్య నిపుణులు. దీని ఆధారంగా భవిష్యత్తులో ఎక్కడికైనా తీసుకెళ్లగల, ధరించగల (పోర్టబుల్‌/వేరబుల్‌) డయలైజర్లను (డయాలసిస్‌ యంత్రాలను) తయారు చేసే అవకాశం ఉందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే రెండేళ్లుగా పరిశోధనలు సాగుతున్నాయని. త్వరలోనే అవి సాక్షత్యరించే అవకాశం వుందంటున్నారు.

వచ్చే మూడేళ్లలో మార్కెట్లో అందరికీ అందుబాటులోకి ప్రత్యేక మెంబ్రేన్ ను తీసుకువస్తామని పరిశోధన బృందానికి నేతృత్వం వహించిన జయేష్‌ బెల్లారి తెలిపారు. ఇప్పటికే దీనికి భారతదేశంలో పేటెంట్‌ లభించింది. ఈ మెంబ్రేన్లను తక్కువ ధరలో తయారు చేసే పైలట్‌ ప్లాంటును స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసి రెండేళ్లుగా పరీక్షిస్తున్నారు. లాబ్యరేటరీ పరీక్షలను పూర్తి చేసుకుని, క్లినికల్ ట్రయల్స్ పూర్వ దశను పూర్తి చేసుకోవాల్సి వుందని చెప్పారు. తమ పరిశోధన ఫలితాల ఆధారంగా భవిష్యత్తులో మూత్రపిండాలు, కాలేయంలా పనిచేసే జీవ-కృత్రిమ అవయవాలను తయారు చేయడం కూడా సాధ్యమవుతుందని బృంద నాయకుడు జయేష్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles