Supreme court removes cbi director ranjit sinha from 2g case

Allegations, Apex court, Prima Facie, retirement, CBI Director, Ranjit Sinha, Janpath, false case, NGOscam, Supreme Court, credibility

Supreme Court removes CBI Director Ranjit Sinha from 2G case; says prima facie credibility in allegations against him

సీబిఐ అధికారులా..? రంజిత్ సిన్హాకు ఏజెంట్లా?

Posted: 11/20/2014 06:46 PM IST
Supreme court removes cbi director ranjit sinha from 2g case

2జీ కుంభకోణం కేసులో కోర్టుకు హాజరైన సీబీఐ అధికారులపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. మీరు సీబిై అధికారులా..? లేక రంజిత్ సిన్హా ఏజెంట్టా..? అంటూ మండిపడింది. అత్యున్నత న్యాయస్థానం ఏకంగా సీబీఐ అధికారులనే నిలదీసే సరికి వారు బిత్తరపోయారు. న్యాయస్థానం నిండు కోలువులో.. వారిని నిలదీయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 2జీ కుంభకోణం కేసుకు సంబంధించిన కేసులో సీబీఐ చీఫ్ రంజిత్‌సిన్హాపై ఉన్న ఆరోపణలపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో కోర్టులో పెద్ద సంఖ్యలో హాజరైన సీబీఐ అధికారులపై సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

కోర్టుకు హాజరుకాని సీబీఐ అధికారి వేణుగోపాల్ గురించి ప్రశ్నించగా అశోక్ తివారి ఆయన గైర్హాజరుపై సమాధానం చెప్పారు. దీంతో జస్టిస్ హెచ్.ఎల్.దత్తుతో కూడిన ధర్మాసనం కోర్టులో ఇంతమంది సీబీఐ అధికారులు ఎందుకు ఉన్నారని ప్రశ్నించింది. విధులు వదిలేసి కోర్టులో సీబీఐ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. మీరు సీబిఐ అధికారులా..?  లేక రంజిత్ సిన్హాకు ఏజెంట్లా?' అని కోర్టు ప్రశ్నించింది. కోర్టులో ఉన్న పలువురు సీబీఐ అధికారులు ఏ కారణంతో హాజరయ్యారో తెలుసుకోవాలని విచారణకు ఆదేశించింది. దీంతో సీబిఐ అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారని సమాచారం.

కాగా సరిగ్గా మరో 12 రోజుల్లో సీబిఐ డైరెక్టర్ పదవికి విరమణ చేస్తున్న రంజిత్ సిన్హాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దేశ సర్వోన్నత న్యాయస్థానం అతనిని 2జీ కుంభకోణం కేసు విచారణ నుంచి తప్పించింది. ఈ కేసులో ఇప్పటికే అరోపణలు ఎదుర్కోంటున్న ఆయన పలువురు దోషులను తప్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని అభియోగాలు నేపథ్యంలో అతనిని విచారణ అధికారిగా తప్పుకోమ్మని అదేశించింది. ఈ కేసు విచారణను ఇకపై రంజిత్ సిన్హా తరువాత సీనియర్ అధికారిని చేపట్టాల్సిందిగా ఆదేశించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్ ఎల్ దత్తు నేతృత్వంలో జస్టిస్ ఎం బీ లోకూర్, జస్టిస్ ఏకే సిక్రీలతో కూడిన ధర్మాసనం.. ఈ మేరకు ఆదేశాలను జారీ చేసింది.

కాగా ఈ అంశంమై సుదీర్ఘ ఆర్డర్ ను ఇవ్వడంపై.. మంచి ఇమేజ్, పరపతి వున్నస్వయం ప్రతిపత్తి  సంస్థను దెబ్బతీస్తుందని అభిప్రాయపడిన న్యాయస్థానం నిరాకరించింది. నిందితులను తప్పించేందుకు అప్పటి ప్రభుత్వ పెద్దలతో పాటు పాలకులను, 2జీ కేసులో అభియోగాలు ఎదుర్కోంటున్న నిందితులను రంజిత్ సిన్హా కలిశారని ఆయనను కేసు విచారాణ అధికారిగా తప్పించాలని పబ్లిక్ ఇన్ట్రెస్ట్ లిటిగేషన్ వేసిన ఎన్జీవో సంస్థ అభియోగాలను నిజమని నమ్ముతున్నట్లు కోర్టు పేర్కోంది. కాగా రంజిత్ సిన్హా తరపు న్యాయవాది అభియోగాలు నిరాదారమైనవని చెప్పారు. సిన్హా నిందితులతో కలసి వున్నాడన్న అభియోగాలు నిజమై వుంటే కేసు ఎప్పుడో కోట్టివేశేవారని వాదించారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles