ఇక్కడున్న యువకుని పేరు ముప్పిడి మధుసూధన్. మంచి సంస్థలో ఉద్యోగం. వచ్చే డబ్బుల్లో కాస్తాకూస్తో జమచేసి పొదుపు చేసుకునేవాడు. ఇంకా మిగిలితే ఇంటికి పంపి అమ్మనాన్నల మెప్పు పొందేవాడు. ఇదంతా గతం. ఇప్పుడు డబ్బులు అస్సలు సరిపోవడం లేదు. నెల జీతం రావడానికి ఇంకా 29 రోజులు ఉండాయనగానే వచ్చిన జీతం అయిపోతోంది. అలా జీతం బ్యాంకులో పడటం ఇలా కార్డుపెట్టి మొత్తం గుంజేయడం. నో పొదుపు..నోనో మదుపు. బుద్ధిగా డబ్బులు దాచుకునే పిల్లగాణికి ఇంతలో ఇన్ని ఇబ్బందులెలా వచ్చాయనే కదా మీ డౌట్. అందరిలాగే మనోడు లవ్‌లో పడ్డాడు.
అలాంటి ఇలాంటి లవ్ కాదది. పెద్ద గుజరాతీ లవ్. కాచిగూడ ఐనాక్స్‌లో ఓ గుజరాతీ అమ్మాయిని చూసి మెలికలు తిరిగిపోయాడు. అది చూసిన ఆ అమ్మాయి ఫ్రెండ్ వీడిదగ్గరికి వచ్చి ..ఖాళీనే ట్రై చేస్కొ అని పచ్చజెండా ఊపింది. అంతే అక్కడ ఆరు పాటలు. పాటలు ముగిసేలోగా నంబర్లు, ఫోన్లు కూడా తారుమారయ్యాయి. పాపం మనోడిది శ్యామ్‌సంగ్ గ్యాలక్సీ. అమాయకమైన గుజరాతీ భామదేమో నోకియా 6033 స్మార్టే కానీ టూ ఓల్డ్. ఏదైతేనేం అమ్మాయి ఇన్నిరోజులు వాడిన ఫోన్..పైగా మనోడిని మెలికలు తిప్పిన అమ్మాయి మార్చుకోకుండా చస్తాడా. అదీ తొలి పరిచయం అటుఇటూ ఆలోచించకుండా చేతులో పెట్టేశాడు గ్యాలక్సీని.
ఇక మనోడికి దాహం మొదలైంది. మాటల దాహమే. మేసేజ్‌లు, వా ట్సాప్‌లు, డైరెక్టు కాల్స్ దాటిపోయి డ్రాపింగ్‌లు, లిప్టింగ్‌లు అన్నీ అయిపోయాయి. ముప్పిడి జీవిత పుస్తకం రంగురంగుల పేజీలతో నిండిపోతోంది. అంతే స్పీడుగా వాడి జేబు కూడా కరిగిపోతోంది. చేసేది లేక నెలనెలా కట్టే చిట్టీలకు చుక్కెట్టెశాడు. అమ్మానాన్నలకు వెళ్లాల్సిన మిగులు..భలేవారే అసలు మిగులుంటేగా..కొత్తలోకం చూద్దామని కొత్తపాత తెలికుండా దొరికినోళ్లందరి దగ్గరా అప్పులు చేసేశాడు. అంతే ఐనాక్స్, ఐమాక్స్‌ల చుట్టూ తిరిగి ఈ లంబోదరుడి ప్రేమాయనం ఖైరతాబాద్ దాటి లకడికపూల్, అమీర్‌పేట్ అలాఅలా ఇదిగో ఇక్కడ ఆగింది.
హైటెక్‌సిటీకి సమీపాన జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ దాటితే చిన్న మలుపు. అక్కడ ఇటీవలే కొత్తగా ప్రవేశపెట్టిన పురుషుల యూరినల్స్ (ఇందులో పోస్తేనట ఆవిరి అయిపోతాయట. వీడి బతుకులాగ ) పక్కన దోశల సెంటర్ పెట్టేసుకున్నాడు. ఆదాయం బాగానే వస్తోంది. రాత్రంతా ఇలా దోశలేయడం..పగలు డ్యూటీ చేయడం..మధ్యలో వీలైనప్పుడల్లా గుజరాతీ భామని బైక్‌లో తిప్పడం. గణపతికే పోటీ ఇచ్చే రేంజ్‌లో పెరుగుతుండే వీటిపొట్ట ఇప్పుడు మన జబర్దస్త్ ధన్‌రాజ్‌లాగా బక్కచిక్కిపోతోంది. కంటినిండా నిద్ర సరిపోక ఆఫీసులో కునికిపాట్లు పడుతున్నాడు. ప్రేమిస్తే ఈ మాత్రం కష్టపడాలి. తప్పుదు కదా అంటున్నాడు.
కార్తిక్
(content courtesy : Amara Narayana , photo courtesy : muppidi madhusudan singh )
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more