Kbr park shooting accused obulesh history cases

kbr park accused obulesh history, ar constable obulesh biography, constable in kbr park firing, kbr park gun shoot, kbr park firing accused, kbr park latest news, aurabindo pharma nithyananda reddy shooting case, kbr park shooting accused person name, hyderabad latest news updates, telangana latest news updates, nithyananda reddy shootng reasons, aurabindo pharma in jagan case

kbr park shooting accused obulesh case history : hyderabad police arrest kbr park firing accused ar constable obulesh on the day incident happend. ar constable police officials says obulesh have crime history before also

కేబిఆర్ కాల్పుల నిందితుడి అసలు బాగోతం ఇది

Posted: 11/20/2014 09:50 AM IST
Kbr park shooting accused obulesh history cases

తెలుగు రాష్ర్టాల్లో సంచలనం రేపిన అరబిందో ఫార్మా వైస్ చైర్మన్ నిత్యానంద రెడ్డిపై కాల్పుల కేసు ఘటనలో పోలిసులు ప్రధాన నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడు పోలిస్ శాఖకు చెందిన ఎ.ఆర్.కానిస్టేబుల్ ఓబులేష్ గా గుర్తించారు. బుధవారమే నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ మొదలు పెట్టారు. ఈ సందర్బంగా ఓబులేష్ చరిత్ర చూస్తే చాలా పెద్ద నేరాల చిట్టా బయటకు వస్తుంది. పోలిసు ముసుగులో నిందితుడు చేస్తున్న అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇవి తెలుసుకుని పోలిసులే ఆశ్చర్యపోతున్నారు.

ప్రస్తుతం హైదరాబాద్ అంబర్ పేటలోని సీపీఎస్ గ్రౌండ్ లో ఓబులేష్ ఏఆర్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. అంతుకుముందు, మొదటగా కర్నూలు ఏపీఎస్పీలో ఏఆర్ కానిస్టేబుల్ గా పోలిస్ శాఖలోకి ప్రవేశించాడు. నాలుగేళ్ల తర్వాత హైదరాబాద్ గ్రేహౌండ్స్ కు బదిలీ అయ్యాడు. గ్రేహౌండ్స్ తరపున విశాఖ ఏజన్సీలో మావోయిస్టుల కోసం కూంబింగ్ లో పాల్గొన్నాడు. ఇక్కడే ఓబులేశ్ అక్రమాలకు తెరతీసినట్లు తెలుస్తోంది. కూంబింగ్ పూర్తిచేసుకుని హైదరాబాద్ తిరిగి వస్తున్న సమయంలో నిందితుడి కు చెందిన ఏకే47 తుపాకీ విజయవాడలో మాయమైందని అందర్నీ నమ్మించాడు. అదెలాగంటే ముందుగా ఈ విషయాన్ని ఓబులేష్ దాచిపట్టాడు. అయితే తనిఖీల్లో తుపాకి మిస్ అయిందని అధికారులు గుర్తించారు. కాని బయటకు చెప్పుకుంటే డిపార్ట్ మెంట్ పరువుపోతుందని రహస్యంగా ఉంచారు.

నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఓబులేష్ ను అంబర్ పేట్ సీసీఎస కు బదిలీ చేశారు. ఇలా తుపాకి పోయిందనగానే పోలిస్ శాఖ కూడా నమ్మేసింది. అయితే ఆ తుపాకి మాత్రం నిందితుడి దగ్గరే ఉందని తాజా కాల్పుల ఘటనతో నిరూపణ అయింది. చేతిలో బలమైన ఆయుధం ఉండటంతో నిందితుడికి దుర్బుద్ధి పుట్టింది. దీంతో అక్రమార్జనకు ప్లాన్లు వేశాడు. సులువుగా ఎక్కువ డబ్బు సంపాదించేందుకు సిద్దపడ్డాడు. ఇందులో భాగంగానే ధనవంతులను కిడ్నాప్ చేసి డబ్బు సంపాదించాలని ప్లాన్ వేశాడు. ఈ క్రమంలోనే నిత్యానందరెడ్డి కిడ్నాప్ కు ప్రయత్నించి దొరికిపోయినట్లు తెలుస్తోంది. గతంలో కూడా ఓ కిడ్నాప్ వ్యవహారంలో బాగా డబ్బులు సంపాదించాడని తెలుస్తోంది. పోలిసు విచారణలో మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : obulesh  kbr park firing  accused  constable  hyderabad  latest news  

Other Articles