Guntur tullur mangalgiri farmers ready to give their lands for ap capital city after cm chandrababu naidu campaign

chandrababu naidu, chandrababu naidu guntur tour, chandrababu naidu latest news, chandrababu naidu news, chandrababu naidu ap capital city, guntur farmers, tullur mandal farmers, mangalgiri farmers, chandrababu naidu meeting with farmers

guntur tullur mangalgiri farmers ready to give their lands for ap capital city after cm chandrababu naidu campaign

భూములిచ్చే రైతులకు బాబు ‘బంపర్’ ఆఫర్!

Posted: 11/18/2014 09:24 PM IST
Guntur tullur mangalgiri farmers ready to give their lands for ap capital city after cm chandrababu naidu campaign

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణంకోసం తమ భూములను ఎట్టిపరిస్థితుల్లోనూ ఇవ్వబోమని గుంటూరుజిల్లా తుళ్లూరు, మంగళగిరి మండలాలకు చెందిన రైతులు తిరుగుబాటు చేయడంతో.. నేరుగా సీఎం చంద్రబాబుకు రంగంలోకి దిగాల్సి వచ్చింది. మంగళవారం సాయంత్రం ఆయన రాజధాని ప్రాంత రైతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగానే మాట్లాడిన ఆయన రైతులందరికీ ‘బంపర్’ ఆఫర్ ప్రకటించారు. భూములిచ్చే రైతులందరినీ పారశ్రామికవేత్తలుగా తయారుచేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగానే బాబు మాట్లాడుతూ.. భూసమీకరణకు సానుకూలంగా ఉన్న రైతులు భయపడాల్సిన పనిలేదన్నారు. భూములిచ్చిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని, వారిని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. భూములు అప్పగించే రైతులను పారిశ్రామికవేత్తలుగా తయారుచేస్తానని అన్నారు.  నైపుణ్య అభివృద్ధి శిక్షణ ఇప్పించి రైతులకు ఉజ్వల భవిష్యత్ అందిస్తామని ఆయన తెలిపారు. కేంద్రం నుంచి వచ్చే పరిశ్రమలన్నీ తొలుత రాజధాని ప్రాంతంలోనే ఏర్పాటు చేస్తామని పేర్కొన్న ఆయన... భూములిచ్చే కుటుంబాల్లో నిరుద్యోగులుంటే వారికి ఉద్యోగవకాశాలు కల్పిస్తామని స్పష్టం చేశారు.

చంద్రబాబు ఇచ్చిన ఈ హామీలతో సంతృప్తి చెందిన రైతులు.. ‘‘తమ ప్రాంతానికి ఏపీ రాజధాని వచ్చినందుకు తమకెంతో గర్వంగా వుందని’’ బాబుతో అన్నారు. రాజధాని నిర్మాణం కోసం తమ భూములు ఇవ్వడానికి సిద్ధమని పేర్కొన్న రైతులు... పరిహారం కింద కొందరు తమకు 1200 గజాల స్థలం ఇవ్వాలంటూ సీఎంను కోరారు. మరికొందరు 1200 గజాల స్థలంతోపాటు 200 గజాల వాణిజ్యభూమిని కూడా ఇవ్వాలన్నారు. ఇందుకు బాబు కూడా సరేనన్నట్లు అంగీకారం తెలిపారని సమాచారం! ఏదైతేనేం.. మొత్తానికి రైతుల మనస్సులను గెలుచుకొన్న బాబు రాజధాని నిర్మాణ అడ్డంకులను సమర్థవంతంగా ఎదుర్కోగలిగారని విశ్లేషకులు అనుకుంటున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chandrababu naidu  ap capital city  guntur district farmers  telugu news  

Other Articles