Is this the world s largest turban man wears 100lb 645m long headdress

World's Largest Turban, 100lb, 645m Long Headdress, multicolor, decorate, silver ornaments, 13 Olympic swimming pools, Patiala, Avtar Singh Mauni.

Is This The World's Largest Turban? Man Wears 100lb, 645m Long Headdress

ఆ తలపాగా..అతనికి కొత్త వెలుగులు అద్దింది..

Posted: 11/18/2014 11:59 PM IST
Is this the world s largest turban man wears 100lb 645m long headdress

వెదవ జీవితంలో సుఖం లేకుండా పోయింది. రోజు లెగడం.. తయారవ్వడం.. ఆఫీసులకెళ్లడం.. అక్కడ పనులు చూసుకుని ఇంటికి తిరిగిరావడం.. రోటీన్ లైప్.. పరమ బోర్ కొడతోందని నిట్టూరుస్తున్నారా.. ముఖ్యంగా అనేక మంది మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి ప్రజల్లో ఇదే అభిప్రాయం వుంటుంది. కానీ అతడిని చూస్తే.. ఔరా..! అనిపించకమానదు. అతడు మనలానే విసుగు చెందితే.. మనం అతడి గురించి చర్చంచుకునే అవకాశమే ఉండేది కాదు. అతడిని దినచర్యలో భాగమైన ఈ పనిని చూస్తే రోజువారి పనుల, రోటిన్ లైప్ స్టైల్ పై ఎవరికీ విరక్తే రాదు.

అతనే అవతార్ సింగ్ మౌని, పంజాబ్ లోని పాటియాలాకు చెందిన 60 ఏళ్ల వృద్దుడు. ఇతడు సిక్కు మత ప్రబోధకుడు. అయితే.. అతని శిరోభారమే అతనిని గౌరవప్రధమైన ప్రభోధకుడిగా గుర్తింపును తీసుకోచ్చింది. అదేలా అంటారా.. అతని తలపాగా, సిక్కులు ధరించే టర్బన్ ఇందుకు కారణమైంది. ప్రతి రోజుల ఉదయాన్నే లేచి స్నానాదులు అచరించిన తరువాత దాదాపుగా ఆరు గంటల సేపు అతని తయారు కావడానికి తీసుకుంటారు. అంత పెద్దది అతని తలపాగా. సుమారు 645 మీటర్ల పొడుడు, 45 కిలోల బరువు వుంటుందట.

ముందుగా 151 మీటర్ల పొడవు తలపాగాను చుట్టుకున్న ఆయన, ఆ తరువాత దానిని క్రమంగా 250, 365, 645 మీటర్లకు పొడగించారు. అంతేకాదు తన తలపాగా సాధరణంగా వుండటం ఇష్టపడని ఆయన అందులో ఆయుధాలు ఆభరణాలను కూడా పేర్చి సుందరంగా తీర్చిదిద్దుతారు. 45 కిలోల తలపాగ బరువుకు ఇవి మరో 10 కిలోల బరువు అదనంగా వుంటుందట. కేవలం తాను ధరించే తలపాగ ఖరీదు 32 వేల రూపాయల పైచిలుకు అవుతుందని చెబుతున్నాడు. కాగా ఇతను  ధరించే తలపాగా చాలా పెద్దదని.. ఇప్పటి వరకు గెన్నిస్ బుక్ లో మేజర్ సింగ్ పేరిట వున్న 400 మీటర్ల పొడవుతో వున్న తలపాగాయే రికార్డు నమోదు  ఈయన తలపాగా బరువు లాంబ్లేటర్ వాహనమంత, పొడవు కనీసం 13 ఒలంపిక్ ఈతకోలనులంత వున్నాయి. దీంతో ఈయన పేరిట గెన్నీస్ బుక్ రికార్డు నమోదు చేయించేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు పలువురు.

సాధారణంగా సిక్కు మతస్థులు వాడే తలపాగా 16 నుంచి 23 ఫీట్లు వుంటుంది.  కానీ వాటిని తోసిరాజని ఏకంగా 645 మీటర్ల తలపాగా చుట్టడమంటే ఎంత కష్టం. తనకు ఒపిక వున్నంత కాలం, తన కాళ్లతో శక్తి వున్నంత వరకు తాను ఈ తలపాగాను ధరిస్తానని గర్వంగా చెబుతున్నాడు అవతార్ సింగ్. ఎప్పుడైన తప్పనిసరి పరిస్థితులల్లో తలపాగా లేకుండా వెళ్లాల్సి వస్తే. తన తల లేదన్న భావన కలుగుతుందంటున్నాడు. తనలోని ఏదో భాగం లేనట్లుగా అనిపిస్తుందని, అది లేకపోవడంతో తాను పడిపోతున్నట్లు కూడా భ్రమ కలుగుతుందని అంటున్నారు. ఇతనితో పాటు ఇతను ధరించిన తలపాగాను చూసేందుకు భక్తలు స్థానికంగా వున్న ఆలయానికి పెద్ద సంఖ్యలో వస్తుంటారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles