Be ready to face snap polls in maharashtra sharad pawar tells ncp cadre

Sharad Pawar, ncp, Alibaug, Maharashtra, Ncp cadre, Maharastra CM, BJP, devendra fednavis

be ready to face snap polls in maharashtra sharad pawar tells ncp cadre

తొందరపడి ముందే కూసిన వృద్ద కోయిల..

Posted: 11/18/2014 05:40 PM IST
Be ready to face snap polls in maharashtra sharad pawar tells ncp cadre

ఆయన ఓ సీనియర్ నాయకుడు. మరో విధంగా చెప్పాలంటే రాజకీయ కురువృద్దుడు ఆయన మరెవరో కాదు.. మహారాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని కాంక్షించి, ఇప్పుడప్పుడే ఎన్నికలు వస్తే.. పార్టీలకు, ప్రజలకు మందిది కాదని, మైనారీటీలో వున్న దేవేంద్ర ఫెడ్నవిస్ నేతృత్వంలోని ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతు ఇచ్చన ఎన్సీపీ అదినేత శరద్ పవార్. అటు ప్రభుత్వానికి మద్దత్తునిచ్చిన ఆయన.. ఇటు తన పార్టీ కార్యకర్తలకు మాత్రం ఎన్నికలకు సిద్దంగా వుండండీ అంటూ సంచలన వ్యాఖ్యాలు చేశారు.

మహారాష్ట్రలో తొలిసారిగా కొలువుదీరిన బీజేపీ ప్రభుత్వం ఎక్కువకాలం కొనసాగదని ఆయన వ్యాఖ్యానించారు. ఫడణవిస్ సర్కారు ఎక్కువ కాలం కొనసాగకపోవచ్చని అనుమానాన్ని వ్యక్తం చేశారు. రాయగఢ జిల్లాలోని అలీబాగ్ లో జరిగిన ఎన్సీపీ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో ఏ క్షణంలోనైనా ఎన్నికలు రావొచ్చని పేర్కొన్నారు. ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ఎన్సీపీ కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. శరద్ పవార్ ప్రకటనతో మహారాష్ట్ర బీజేపి వర్గాలు విస్మయం వ్యక్తం చేశాయి.

చిరకాల మిత్రపక్షం శివసేనతో తెగతెంపులు చేసుకున్న బీజేపీకి ఎన్సీపీ స్నేహహస్తం అందించింది. అక్టోబర్ 31న ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఫెడ్నవిస్.. ఈ నెల 12న ఎన్సీపీ మద్దతుతో రాష్ట్ర అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకున్నారు. నెల రోజులూ కూడా నిండకుండానే శరద్ పవార్ తన వ్యాఖ్యలతో ఫెడ్నవిస్ ప్రభుత్వానికి షాకిచ్చారు.  అయితే శరద్ పవార్.. తొందరపడి ముందుగానే కూస్తున్నారని, అలాంటిదేమీ జరగదని ప్రభుత్వవర్గాలు అంటున్నాయి.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sharad Pawar  ncp  Alibaug  Maharashtra  Ncp cadre  Maharastra CM  BJP  devendra fednavis  

Other Articles