A girl walks around mumbai for 10 hours and proves that not all men are the same

Women, Walks, Mumbai, 10 Hours, Prove, safe, india, All Men Are Not The Same, New York, Pune, same result, good news, harrasement

A Girl Walks Around Mumbai For 10 Hours. And Proves That Not All Men Are The Same

మహిళలకు భారత్, ముంబై చాలా సేఫ్..

Posted: 11/18/2014 11:00 PM IST
A girl walks around mumbai for 10 hours and proves that not all men are the same

ముంబై నగరంలో మహిళల మానప్రాణాలకు రక్షణ ఉందా? అన్న ప్రశ్నలు ఎప్పుడు రేకెత్తుతూనే వుంటాయి. ఏళ్లుగా అభివృద్ది చెందుతున్న దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మహిళలకు సంపూర్ణ రక్షణ వుందంటోంది ఈ వీడియో. మహిళల వేషాధారణతోనే వారు విషత్రర పరిణామాలను ఎదుర్కోంటుంటారని పలువురు నేతలు వాదించినా..? ఆ వాదనల్లోనూ నిజం లేదని తేటతెల్లం చెస్తోంది ఈ ఉదంతం. అగ్రరాజ్యం అమెరికాలోని న్యూయార్క్ సిటీలో ఓ సినీనటి.. పది గంటల పాటు అక్కడి వీధుల గుండా వెళ్లగా.. అకాతాయిలు ఎందరో అమెను కామెంట్ చేశారు. కొందరు పెళ్లి ప్రపోజల్స్ చేయగా, మరికోందరు ఫోన్ నెంబరు కావాలని, కొందరు అందంగా వున్నావని అనేక రకాలుగా కామెంట్లు చేశారు. ఒంటిని నిండుగా కప్పున్నట్లుగా జీన్స్ ఫ్యాంట్, టీ షర్ట్, దానిపై మరో చోక్కాను వెసుకుని వెళ్లినా.. శృతిమించిన స్థాయిలో అకతాయిల వేధింపులు ఎదుర్కోంది. పది గంటల్లో వీధుల్లో నడవడంతో సదరు సినీనటి నరకాన్ని చూసినట్లుగా వుందని అభిప్రాయపడిన విషయం తెలిసిందే.

ఇదే తరహాలో భారత ఆర్థిక రాజధాని ముంబైలో మహిళలు ఎదుర్కొంటున్న పరిస్థితిపై రంబుల్ అనే సంస్థ ప్రయోగానికి సిద్దమైంది. ఓ మోడల్ ను 10 గంటల పాటు ముంబైలోని జనసాంధ్రత కలిగిన  ప్రాంతాల్లో తిప్పితే ఎలా వుంటుందని పరీక్షించాలనుకున్నారు. అభివృద్ది చెందిన అగ్రరాజ్యానికి పూర్తి భిన్నంగా ఓ మోడల్.. షాట్ స్కర్ట్, టాప్ తో డ్రెసింగ్ చేసుకుంది. అలా ముంబైలోని అందేరి, దాదర్ ఈస్ట్, బంద్రా, కుర్లా, మెరైన్ డ్రైవ్, ఫోర్ట్ మార్కెట్, సీఎస్ టీ, తదితర వీధులన్నీ నడుచుకుంటూ తిరిగింది. అయితే ఎక్కడా ఎవరూ కూడా ఈ మోడల్ ను కామెంట్ చేయలేదు. అసలు ఒక్క అకతాయి కూడా ఈమె దరికి రాలేదు. భిన్న సంస్కృతులకు నిలయమైన భారత్ లో మహిళలకు సముచిత స్థానం వుందనడానికి ఇది ఉదాహరణ. ముంబై లోనే కాదు ఇలానే పూణేలో కూడా మరో ప్రయోగం చేశారు. అక్కడా ఎవ్వరూ అ మోడల్ ను కామెంట్ చేయలేదు. అయితే ఎక్కడో జరిగే చిన్న ఘటనలను మీడియా సహా పత్రికలు పెద్దవిగా చేసి చూపడం..మొత్తం ముంబైలో అలాంటి పరిస్థితే వుందని పలువురు భ్రమపడటంతో వారి లోని ఆందోళనను ఈ వీడియో పటాపంచలు చేస్తోందని విశ్వసిస్తున్నామని అంటున్నారు నిర్వాహకులుజ

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Women  Walks  Mumbai  10 Hours  Prove  safe  india  All Men Are Not The Same  New York  Pune  same result  good news  harrasement  

Other Articles