Chocolate could cease to exist with coca deficit

chocolate producing companies, how to make chocolate, how to make different chocolate, chocolate flavour taste, chocolate trees, coca trees production, latest news updates, coca trees in africa, chocolate brands, nestle chocolates, cadbury chocolates

chocolate could cease to exist with coca deficit : chocolate producing companies facing problems and maintains deficits with africa fungal disease caused productions loss

ఇలా అయితే అందరికి చాక్లెట్లు ఇవ్వటం చాలా కష్టం

Posted: 11/19/2014 01:20 AM IST
Chocolate could cease to exist with coca deficit

చాక్లెట్ అంటే ఇష్టపడని వారెవరు చెప్పండి. పుట్టినరోజు, పెళ్ళిరోజు కానుకలో కాంప్లిమెంటరీ గిఫ్ట్, గర్ల్ ఫ్రెండ్ మనసు కొట్టేసేందుకు బాయ్ ఫ్రెండ్ ఉపయోగించే సాధనం ఇలా ప్రతి మధుర అనుభవాన్ని మనం చాక్లెట్ తో షేర్ చేసుకుంటున్నాం. అందుకే అమితాబ్ తియ్యని వేడుక చేసుకుందామంటూ.., చాక్లెట్లు తింటాడు. ఇక చిన్న పిల్లల సంగతి అయితే చెప్పనక్కర్లేదు గుక్కపట్టి ఏడుస్తున్న వారయినా.., చాక్లెట్ ఇస్తే సైలెంట్ అయిపోతారు. ఏం మాయ చేస్తుందో తెలియదు కానీ.., చిటికెలో మొహంలో నవ్వు తెప్పిస్తుంది. ఇలా మన జీవితంలో ఇంత ప్రాముఖ్యత ఉన్న ఈ తీపి పదార్ధం ఇక దొరకటం కష్టం అవుతుంది అంటున్నారు.

చాక్లెట్లు తయారు చేసే ప్రముఖ కంపనీ మార్స్ ఈ చేదువార్తను వెల్లడించింది. 2013 లెక్కలను చూస్తే.., ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు 70వేల టన్నుల చాక్లెట్లను తిన్నారట. ఈ సంఖ్య వచ్చే పదేళ్లలో 14రెట్లు పెరుగుతుందని వారు అంచనా వేస్తున్నారు. చాక్లెట్లకు డిమాండ్ పెరుగుతున్నందుకు సంతోషపడాల్సింది పోయి., ఇదెక్కడి డిమాండ్ బాబోయ్ అని వీరు బాధపడుతున్నారు. ఎందుకంటే చాక్లెట్ లో ఉపయోగించే కొకా లభించటం లేదు కాబట్టి. ప్రపంచ వ్యాప్తంగా 70శాతం కోకా దక్షిణ ఆఫ్రికా, ఘనా ప్రాంతాల్లో ఉత్పత్తి అవుతుంది. అయితే కొద్దికాలంగా ఆఫ్రికాలో ఎబోలా, సహా ఇతర అంటు వ్యాధులు ప్రబలాయి. దీంతో విదేశాల నుంచి ఈ ప్రాంతాలకు ఎవరూ వెళ్ళటం లేదు. ఫలితంగా కోకా ఉత్పత్తి ఆఫ్రికా నుంచి బయటకు రావటం లేదు.

కోకా లభించకపోవటంతో తయారీ కంపనీలు చాక్లెట్ల రేట్లను అమాంతం పెంచేశాయి. అయితేనేం.., పెరిగే ధరలకు హద్దే లేదు... తినేవారికి కొదువే లేదు అన్నట్లుగా, ధరలు ఎంత పెరుగుతున్న డిమాండ్ మాత్రం తగ్గటం లేదు. ఇంకా చెప్పాలంటే రోజురోజుకూ చాక్లెట్లకు డిమాండ్ పెరుగుతోంది. తమ వద్ద ఉన్న కోకా నిల్వలతో మరికొద్ది కాలం మాత్రమే చాక్లెట్లు తయారు చేయగలమని ఆ తర్వాత పరిస్థితి ఏమిటని తయారీ కంపనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. చాక్లెట్ ప్రియులను ఎలా సంతృప్తి పరచాలి అని ఆవేదన చెందుతున్నాయి. వీరికి సమాధానం చెప్పేలా మధ్య ఆఫ్రికాలో శాస్ర్తవేత్తలు కృత్రిమంగా చాక్లెట్ చెట్లను అభివృద్ధి చేస్తున్నారు. సాధారణ చెట్టుతో పోలిస్తే., ఈ కోకా చెట్టు నుంచి ఏడు రెట్లు ఎక్కువగా కోకా ఉత్పత్తి అవుతుంది. అయితే రుచి, నాణ్యతలో మాత్రం ఖచ్చితంగా తేడాలు ఉంటాయని చెప్తున్నారు. ఈ కృత్రిమ చాక్లెట్ రుచి ప్రజలకు నచ్చక పోవచ్చు కాబట్టి దీన్ని నమ్ముకుని వ్యాపారాలు చేయలేము అని చేతులెత్తేస్తున్నారు. స్థూలంగా చెప్పాలంటే సమీప భవిష్యత్తులో చాక్లెట్ల కొరత మరీ చెప్పాలంటే చాక్లెట్ల కరువు వస్తుందన్నమాట. కాబట్టి ఆ పరిస్థితులను తట్టుకునేందుకు ప్రజలు, ముఖ్యంగా చాక్లెట్ ప్రియులు నోరు కట్టేసుకుని వీటిని తినటం తగ్గిస్తే  మంచిది. ఇది ఆరోగ్యకరం కూడా.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chocolates  coca  latest news  africa  production  

Other Articles