Five years old boy saved three years boy

hree years boy, five years boy, Guntur district, nandu, joseph, Bhavani, childrens day

five years old boy saved three years boy

పసివాడి ప్రాణాన్ని కాపాడిన చిన్నారికి సత్కారం..

Posted: 11/14/2014 08:00 AM IST
Five years old boy saved three years boy

ఐదేళ్ల బాలుడు, అతని కళ్ల ముందు ఓ ప్రాణం అనంత వాయువులో కలిసేందుకు సిద్దమైంది. ఏదో జరుగుతుందని అతనికి అర్థమైంది. కానీ ఎలా చేయాలో అర్థం కాలేదు. అయినా తన వయస్సును మించి ఆ చిన్నారు సాహసించాడు. తన కన్నా రెండేళ్ల చిన్నారిని ప్రమాదం నుంచి కాపాడాడు. ఇవాళ బాలల దినోత్సవం సందర్భంగా ఆ చిన్నారికి పాఠశాలలో సన్మానం కూడా జరుగుతోంది. అభం శుభం తెలియని వయస్సులో ఐదేళ్ల చిన్నారి చేసిన సాహసాన్ని అక్కడి వారందరూ మొచ్చుకుంటున్నారు.

తన కళ్లముందే నీళ్లకుండీలోకి జారిన మూడేళ్ల పసివాడిని ఐదేళ్ల బాలుడు కాపాడిన సంఘటన గుంటూరు జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సోమవారం జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. అమరావతి మండలం వైకుంఠపురంలోని దళితవాడలోని మంచినీటి ఓవర్‌హెడ్ ట్యాంకు సమీపంలో నేలపై మూతలేని నీళ్లకుండీ ఉంది. కొందరు పిల్లలు దానిపైన కూర్చొని కాళ్లు లోపలపెట్టి ఆడుకుంటున్నారు.
 
 పిల్లలంతా అక్కడి నుంచి వెళ్లిపోగా స్థానికంగా నివసించే జయపాల్, సుమలతల కుమారుడు నందు (3) కుండీలోని నీళ్లలోకి జారిపోతుండటాన్ని నండూరి పరిశుద్ధం కుమారుడు జోసెఫ్ (5) గమనించాడు. వెంటనే నందు చేతిని బలంగా పట్టుకున్నాడు. నందును కాపాడాలని ఆతను చేసిన ప్రయత్నం విఫలం కాకూడదని తలిచాడు. కాని నందూను ఒంటి చేత్తో కాపాడటానికి అతని బలం సరిపోలేదు. దీంతో ఏదో జరిగిపోతోందంటూ గట్టిగా అరిచాడు. అటుగా వెళ్తున్న మేకల భవాని అనే మహిళ వచ్చి నందును బయటకు తీసింది. దీంతో మూడేళ్ల పసివాడు ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ప్రమాదాన్ని పసిగట్టి కాళ్లను నేలకు, కుండీకి అదిమిపట్టి నందు మునిగిపోకుండా కాపాడిన జోసఫ్‌ను అందరూ అభినందించారు. అతడిని బాలల దినోత్సవం సందర్భంగా ఇవాళ అభినందించనున్నట్లు ఆర్‌సీఎం ప్రాధమిక పాఠశాల ఉపాధ్యాయులు చెప్పారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : hree years boy  five years boy  Guntur district  nandu  joseph  Bhavani  childrens day  

Other Articles