Whatsapp causes divorce cases increased in italy

whatsapp status checking, whatsapp profile edit change, whatsapp groups creation management, whatsapp latest news, social media, social networkin sites, world latest news, technology latest updates, how to get divorce, divorce sections in india, whatsapp problems

whatsapp causes divorce cases increased in italy : social networking site whatsapp have many uses at the same time many losses with this application. in Italy whatsapp causes for increasing divorce cases

వాట్సాప్ తో పెళ్లి పెటాకులే, పెరిగిన విడాకులు

Posted: 11/13/2014 01:11 AM IST
Whatsapp causes divorce cases increased in italy

ప్రతి దానితో లాభం ఉన్నట్లే నష్టం కూడా ఉంటుంది. అలాగే సోషల్ నెట్ వర్కింగ్ అప్లికేషన్ అయిన వాట్సాప్ తో ఎన్నో లాభాలు ఉన్నాయి. ఆండ్రాయిడ్ ఫోన్ల వినియోగారుల్లో ఈ యాప్ తప్పనిసరి. ఫోటో షేరింగ్, చాటింగ్, గ్రూప్ చాట్, వాయిస్ రికార్డ్ పంపటం, వీడియోలు పంపటం.., ఇలా ఒక్క యాప్ తో ఎన్నో సౌకర్యాలు ఉన్నాయి. అందుకే ఈ యాప్ అందరి ఫోన్లలో తప్పనిసరి అయింది. అయితే దీనివల్ల లాభాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయి అంటున్నారు ఇటలీకి చెందిన గియాన్ ఎట్టోర్ గస్సానీ.

ఇటాలియన్ అసోసియేషన్ ఆఫ్ మ్యాట్రిమోనియల్స్ అద్యక్షుడు అయిన ఎట్టోర్ గస్సానీ టైమ్స్ పత్రికతో మాట్లాడుతూ.., వాట్సాప్ వల్ల దేశంలో విడాకుల సంఖ్య పెరుగుతోందన్నారు. అదెలాగని ప్రశ్నిస్తే, వాట్సాప్ వల్ల ప్రపంచంలో మొబైల్ నంబర్ తెలిసిన యాప్ యూజర్లు ఎవరితో అయినా చాట్ చేయవచ్చు. అలా చాటింగ్ మొదలు పెట్టి, పెళ్ళి తర్వాత మరొకరితో ప్రేమికులుగా మారి వారికోసం వివాహ బంధాన్ని తెంచుకుంటున్నవారు కొందరు. ఇంకొందరు అయితే తమ లవర్ తో పెళ్ళి తర్వాత చాటింగ్ చేస్తూ... తరుచుగా ఫొటోలు, వీడియోలు షేర్  చేసుకుని గత జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చుకుని విడిపోతున్నారు అని చెప్పాడు.

అపరిచితులతో చాటింగ్ చేయటంతో పాటు అనవసరమైన సంబాషణలు ఈ ఉపద్రవంకు కారణం అవుతున్నాయన్నారు. కుటుంబమే సమాజ మూలస్థంభంగా ఉన్న ఇటలీ లాంటి దేశాల్లో ఇలా సామాజిక మూలాల్ని వాట్సాప్ దెబ్బతీసే ప్రయత్నం చేయటం ఆందోళనకరమని హెచ్చరించారు. కాబట్టి ఏదయినా సక్రమంగా వినియోగించుకుంటేనే సత్ఫలితాలు వస్తాయి. లేదంటే ప్రమాదాలు, ఉపద్రవాలు, చివరకు విషాదాలు తప్పవు. ఇది వాట్సాప్ మరోసారి రుజువు చేస్తోంది. సో మీరూ జాగ్రత్తగా చాట్ చేయండి.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : whatsapp  social media  divorce  latest news  

Other Articles