Chandrababu afraid of junior ntr says harish rao

chandrababu naidu on junior ntr, chandrababu ntr war, chandrababu ntr issue, chandrababu latest news updates, harish rao on chandrababu naidu, harish rao on junior ntr, harish rao on lokesh, andhrapradesh telangana latest political news

chandrababu afraid of junior ntr says harish rao : telangana minister harish rao alleges that ap chief minister harish rao afraid of junior ntr that is the reason he is putting ntr aside from party activities

యంగ్ పులిని చూసి భయపడ్డ చంద్రబాబు

Posted: 11/13/2014 12:00 AM IST
Chandrababu afraid of junior ntr says harish rao

తెలుగు రాజకీయాల్లో చంద్రబాబు ఎత్తులకు పై ఎత్తులు వేయగల నేర్పరి. ప్రతికూల అంశాల్ని కూడా అటు తిప్పి ఇటు తిప్పి తనకు అనుకూలంగా మార్చుకోగల సత్తా బాబుకు ఉంది. తనకు అనుకూలంగా ఉండేవారిని అందలం ఎక్కించటంతో పాటు ఇబ్బందికర వ్యక్తులు ఉంటే కనీసం నీడను కూడా తాకనివ్వడు అని రాజకీయ నేతలు చెప్పుకోవటం తెలిసిందే. తాజాగా టీఆర్ఎస్ నేత, మంత్రి హరీష్ రావు ఇదే తరహా కామెంట్లు చేశారు. నారా లోకేష్ ను పైకి తీసుకొచ్చేందుకు చంద్రబాబు చేసిన పనులను వివరించారు.

నారా లోకేష్ కు జూనియర్ ఎన్టీఆర్ పోటీగా వస్తాడు అనే ఉద్దేశ్యంతోనే చంద్రబాబు ఆయన్ను దూరం పెట్టారని ఆరోపించారు. ప్రజల్లో విశేష ఆదరణ ఉన్న జూనియర్ ఎన్టీఆర్ పార్టీలోకి వస్తే, ఆయనకు మరింత ఫాలోయింగ్ పెరగటంతో పాటు పార్టీలో క్రేజ్ ఉన్న వ్యక్తిగా ఎదుగుతాడు. ఇదే జరిగితే చిన్నబాబు లోకేష్ పైకి రావటం కష్టం అవుతుంది. కాబట్టి.., ఎన్టీఆర్ ను పార్టీకి క్రమంగా దూరం చేయటంతో పాటు పార్టీ కార్యక్రమాలకు కూడా నామమాత్రంగా ఆహ్వానించటం ద్వారా ఆయన్ను పొమ్మనలేక పొగబెట్టినట్లు చేశారని ఆరోపించారు.

ఇక కేసీఆర్ కు తాను వెన్నుపోటు పొడుస్తానని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలపై హరీష్ రావు తీవ్రంగా స్పందించారు. తనకు రాజకీయ జీవితం, పదవీ కేసీఆర్ పెట్టిన భిక్ష అనీ.., అలాంటి వ్యక్తికి ద్రోహం చేయాల్సిన అవసరం లేదన్నారు. మరోసారి రేవంత్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. టీడీపీ వెన్నుపోట్ల పునాదుల మీద నడుస్తున్న పార్టీ అని.., అది తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది అని ఎద్దేవా చేశారు.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : chandrababu  junior ntr  nara lokesh  latest news  

Other Articles