Sujanachowdhury faces trouble after swearing in as union minister mauritius commericial bank approaches high court on debts

Mauritius Commercial Bank, The High Court, Union Minister, Sujana Chowdhury, Petition, Universal Industries, Hestiya

sujanachowdhury faces trouble after swearing in as union minister, Mauritius commericial bank approaches High court on debts of Rs 106 crore

పదవొచ్చిన వేళా.. విశేషం బాగోలేదేమో.. సుజనా..

Posted: 11/12/2014 11:16 AM IST
Sujanachowdhury faces trouble after swearing in as union minister mauritius commericial bank approaches high court on debts

ఎవరికైనా, మంచి చెడులు జరిగితే.. వాటిని ఆ సందర్భంలో వచ్చిన వాటికి ఆపాదిస్తాం. సరిగ్గా టీడీపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరికి కేంద్ర సహాయ మంత్రి పదవి రాగానే.. ఆయనపై ఆరోపణలు తీవ్రస్థాయిలో వస్తున్నాయి. అంతేకాదు.. ఇన్నాళ్లు నిమ్మకున్న బ్యాంకులు కూడా నేరుగా హైకోర్టులను ఆశ్రయించి తమకు న్యాయం చేయాల్సింది పిటీషన్లు దాఖలు చేస్తున్నాయి. అప్పటి వరకు సజనా చౌదరి ఓ ప్రఖ్యాత వ్యాపారవేత్తగా చూసిన రాష్ట్ర ప్రజలకు..మంత్రి పదవి చేపట్టగానే నిజ స్వరూపం బయటపడుతోంది. ఆయన 316 కోట్ల రూపాయల మేర భారతీయ బ్యాంకుల్లో డిపాల్టర్ గా వున్నారని, దేశంలో బ్యాంకులను అత్యధికంగా బ్యాంకులకు బాకీ వున్న వారిలో సుజనా చౌదరి 8వ వారని ఆరోపణలు వస్తున్నాయి. దీనికి తోడు ఇప్పడు ఏకంగా మారిషియస్ కు చెందిన మారిషియస్ కమర్షియల్ బ్యాంకు రాష్ట్ర హైకోర్టులో పిటీషన్ వేసింది.

సుజనా చౌదరి తమకు 106 కోట్ల రూపాయలు బకాయి ఉన్నారని, సొమ్ము చెల్లించాలని కోరినా సమాధానం చెప్పడంలేదంటూ మారిషస్‌కు చెందిన మారిషస్ కమర్షియల్ బ్యాంక్(ఎంసీబీ) ఉమ్మడి హైకోర్టును ఆశ్రయించింది. తమ బకాయి తిరిగి చెల్లించే పరిస్థితిలో లేనందున ఆయనకు చెందిన సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌ను మూసివేసి, దాని ఆస్తులను అమ్మి, తమ అప్పు తీర్చేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఆ సంస్థ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది. సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ మారిషస్‌లో హేస్టియా పేరుతో అనుబంధ కంపెనీ ఏర్పాటు చేసింది. హేస్టియా 2010లో ఎంసీబీ నుంచి రూ.100 కోట్లు రుణం తీసుకుంది. ఈ లావాదేవీలో సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ హామీదారు (గ్యారెంటార్)గా ఉంది.

రుణానికి సంబంధించి ఇంగ్లిష్ చట్టాలకు లోబడి ఎంసీబీకి, హేస్టియాకు మధ్య రాతపూర్వక ఒప్పందం కూడా జరిగింది. 2012 నుంచి హేస్టియా రుణ చెల్లింపులు నిలిపివేసింది. వీటి పై హేస్టియాకు ఎంసీబీ పలుమార్లు లేఖలు రాసింది. అయితే, ఒప్పందానికి సవరణలు చేయాలని హేస్టియా కోరగా, అందుకు ఎంసీబీ అంగీకరించింది. ఆ తరువాత కూడా బకాయిలు చెల్లించకుండా మరోసారి ఒప్పందానికి సవరణలు చేయించింది. ఇదే సమయంలో ఎంసీబీ అధికారులు హేస్టియా డెరైక్టర్‌గా ఉన్న సుజనా చౌదరిని ఎస్‌ఎంఎస్ ద్వారా సంప్రదించారు. బకాయి ఉన్న మాట వాస్తవమేనని, జరుగుతున్న పరిమాణాలకు క్షమాపణలు కోరుతున్నానని ఎంసీబీ అప్పటి గ్లోబల్ బిజినెస్ హెడ్ ప్రతిక్ ఘోష్‌కు 2012, అక్టోబర్ 16న సుజనా చౌదరి ఎస్‌ఎంఎస్ పంపారు.  వీలైనంత త్వరగా మొత్తం వ్యవహారాన్ని పరిష్కరిస్తామన్నారు. తాను అమెరికా వెళుతున్నానని, అక్కడి నుంచి తిరిగి వచ్చాక బ్యాంకర్లతో మాట్లాడతానని ఆ ఎస్‌ఎంఎస్‌లో సుజనా చౌదరి పేర్కొన్నారు. ఆ తరువాత కూడా బకాయిలు చెల్లించలేదు. బ్యాంకు పంపిన నోటీసులకు కూడా స్పందన లేదు. వడ్డీతో సహా బకాయి ఉన్న రూ.105 కోట్లు, ఖర్చుల కింద మరో రూ.72 లక్షలు ఎంసీబీకి చెల్లించాలని లండన్‌లోని క్వీన్స్ బెంచ్ కమర్షియల్ కోర్టు ఆదేశించింది.

బకాయి చెల్లించే విషయంలో హేస్టియా, సుజనా యూనివర్సల్ చేస్తున్న అసాధారణ జాప్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ కంపెనీని మూసివేయాలని కోరుతూ హైకోర్టులో మారిషస్ కమర్షియల్ బ్యాంకు పిటిషన్ వేసింది. సుజనా యూనివర్సల్‌ను మూసివేసి, ఆ కంపెనీ ఆస్తులను విక్రయించి తమ బకాయిలను తీర్చేందుకు ఓ అధికారిక లిక్విడేటర్‌ను నియమించాలని కోరింది. అంతేకాకుండా కంపెనీ ఆస్తులను విక్రయించడం, అన్యాకాంత్రం చేయడం, థర్డ్ పార్టీ హక్కులు సృష్టించడం చేయకుండా కూడా ఆదేశాలివ్వాలని హైకోర్టును ఎంసీబీ కోరింది. దీనిపై గతంలో లండన్‌లోని క్వీన్స్‌ కోర్టులో ఇచ్చిన ఆదేశాలను కూడా జతపర్చిమాని చెప్పింది. ఈ తీర్పును హిస్టీయా సంస్థ, సుజనా సంస్థలు బేఖాతరు చేశాయని పేర్కొంది. దీనిపై విచారణను హైకోర్టు ఈనెల 18వ తేదీకి వాయిదా వేసింది. మొత్తానికి పదవి వచ్చిన వేళా విశేషం సుజనా చౌదరికి కలసిరానట్టుగా వుంది. అందుకే పదవి రాగానే మోడీ ప్రభుత్వంలో విమర్శలు, ఆరోఫణలు ఎదుర్కొంటున్న ప్రధాన కేంద్ర మంత్రిగా టార్గెట్ అయ్యారు సుజనా..

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles