భారతీయ రైల్వే చరిత్రలో పెను ప్రమాదం తృటిలో తప్పింది. ప్రమాదం అంచుల వరకు వెళ్ళిన రైలు గేట్ మెన్ అప్రమత్తత వల్ల వెనక్కి వచ్చింది. దేశంలోనే అత్యంత వేగంగా వెళ్ళే రైలుగా పేరున్న ప్రతిష్టాత్మక శతాబ్ది ఎక్స్ ప్రెస్ రైలు సోమవారం భారీ ప్రమాదం నుంచి తప్పించుకుంది. ఎప్పట్లాగే సోమవారం ఉదయం న్యూ ఢిల్లీ నుంచి అజ్మీర్ కు శతాబ్ది ఎక్స్ ప్రెస్ బయల్దేరింది. ప్రయాణ సమయంలో రైలులో 300మంది వరకు ప్రయాణికులు ఉంటారని అంచనా. జైపూర్ కు 40 కిలోమీటర్ల దూరంలో బోబాస్ అనే స్టేషన్ కు చేరుకునే ముందు రైలులో ఏదో లోపం ఉన్నట్లు గేట్ మెన్ కలురాం గుర్తించాడు.
వెంటనే స్టేషన్ మాస్టర్ రామావతార్ కు సమాచారం ఇచ్చాడు. అయితే మెరుపువేగంతో ప్రయాణిస్తున్న రైలు రామావతార్ స్పందించేలోపు బోబాస్ దాటేసింది. గేట్ మెన్, స్టేషన్ మాస్టర్ లో భయాందోళనలు పెరిగాయి. విషయాన్ని రైల్వే సూపరిండెంట్ కు చెప్పారు. దీంతో ఆయన రైలు మార్గంలోని తర్వాతి స్టేషన్ అస్సాలర్పూర్ సమీపంలో రైలును ఆపివేయించారు. తనిఖీ చేస్తే.., రైలులో ఒక చక్రం సగంమేర విరిగిపోయి ఉంది. ఇది చూసి అధికారులు షాక్ అయ్యారు. ఇంకొద్ది దూరం ఇదే స్పీడుతో ప్రయాణించి ఉంటే పెను ప్రమాదం జరిగేది. ఈ నష్టాన్ని ఊహిస్తేనే వణుకు పుడుతుంది అని అధికారులు తెలిపారు.
ఇక రైలుకు కొత్త చక్రం అమర్చి తిరిగి ప్రయాణం ప్రారంభించారు. రైల్వే శాఖలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ రైలుకు న్యూఢిల్లీలో బయల్దేరేముందు సిబ్బంది పూర్తిగా తనిఖీలు చేస్తారు. బోగీల అనుసంధానం, ఇంజన్ లో లోపాలు తదితర అంశాలను పరిశీలించి అన్ని ఓకే అనుకుంటే జర్నీ మొదలు పెట్టమని సూచనలు ఇస్తారు. కాని ఒక చక్రం సగం మేర విరిగిపోయిందంటే సిబ్బంది సరిగా తనిఖీ చేయలేదని అధికారులు భావించారు. ఈ ఘటనపై ధర్యాప్తుకు ఆదేశించిన నార్త్ వెస్ట్ రైల్వే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more