Chandrababu naidu and team went to singapore

chandrababu singapore tour, babu singapore tour latest updates, chandhrababu on singapore, chandrababu latest news, andhrapradesh vs singapore, latest telugu news, singapore tourist places, singapore ruling

chandrababu naidu went to singapore : andhra pradesh chief minister went to singapore tour with his government ministers and some of officials to observe developement method and administration to implement in andhrapradesh

డ్రీమ్ వరల్డ్ కు వెళ్ళిన చంద్రబాబు, మతలబు..?

Posted: 11/11/2014 09:28 PM IST
Chandrababu naidu and team went to singapore

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సింగపూర్ పర్యటనకు వెళ్ళారు. తన బృందంతో కలిసి మంగళవారం సాయంత్రం బాబు బయల్దేరారు. సీఎం అయిన తర్వాత చేస్తున్న తొలి పర్యటన ఇదే. తరుచుగా ఏ విధానం తీసుకున్నా సింగపూర్ లా ఉండాలి అని చెప్పే చంద్రబాబు అక్కడి పరిపాలనా విధానాలు, ఏపీలో అమలు చేయాల్సిన కొత్త అంశాలను అధ్యయనం చేయనున్నారు. గతంలోనే మంత్రుల బృందం రాజధాని నిర్మాణం నమూనా కోసం విదేశీ పర్యటన చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. తాజాగా నేరుగా చంద్రబాబు పర్యటన చేపట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది.

పరిపాలన, నిర్ణయాల అమలులో తరుచుగా బాబు నోట సింగపూర్ మాట విన్పిస్తుంది. ఏది చెప్పినా ఇది సింగపూర్ లా ఉండాలి, అది సింగపూర్ లో చేసినట్లుగా చేయాలి, రాజధాని నిర్మాణంలో సింగపూర్ సలహాలు అవసరం అని విదేశీ జపం చేసేవారు. దీనిపై విమర్శలు వచ్చినా పట్టించుకోలేదు. బాబు సింగపూర్ సీక్రెట్ ఏమిటా అని తెలుసుకుని కేసీఆర్ కూడా ఒకడుగు ముందుకేసి బాబుకంటే ముందే పర్యటన చేశారనుకొండి. ఇక ప్రస్తుతం తన డ్రీమ్ వరల్డ్ కు వెళ్ళిన ముఖ్యమంత్రి అక్కడి ప్రభుత్వ ప్రతినిధులతో సమావేశం కానున్నారు. పట్టణీకరణ, నగరాల అభివృద్ధి కోసం వారు అమలు చేస్తున్న నిర్ణయాలు, ప్రభుత్వ విధానాలపై అధ్యయనం చేయనున్నారు.

ప్రధానంగా నగరీకరణ, పారిశ్రామిక అభివృద్ధి, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చటం అనే అంశాలపై సలహాలు తీసుకుంటారని సమాచారం. అదేవిధంగా ఏపీ పరిస్థితులు వివరించి, రాష్ర్టంలో ఎలాంటి విధానాలు అమలు చేస్తే త్వరగా అభివృద్ధి జరుగుతుందనే విషయంపై కూడా సింగపూర్ ప్రతినిధుల నుంచి సలహాలు తీసుకునే అవకాశం ఉంది. ఇక పర్యటనలో భాగంగా దక్షిణాసియా వార్సిక సదస్సులో కూడా బాబు ప్రత్యేక అతిధిగా పాల్గొని ప్రసంగిస్తారు. మొత్తానికి డ్రీమ్ వరల్డ్ కు వెళ్ళిన ఏపీ ముఖ్యమంత్రి సింగపూర్ నుంచి ఏం సమాచారం పట్టుకొస్తారో వేచి చూడాలి.

 

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : singapore  chandrababu naidu  andhra pradesh  latest news  

Other Articles