Lions afraid with porcupine in south africa zoo

Porcupine benefits, Porcupine meat sale, Porcupine vs lions, Porcupine fights with lions, lions scared of Porcupine, zoo animals, wild life animals, latest news

lions afraid with Porcupine in south africa zoo : in south africa crugar zoo 13lions tried to attack a Porcupine but pig maintained to defece attack with its porks video released

‘సింహాలే గుంపులుగా వచ్చాయి, పంది సింగిల్ గా వచ్చింది

Posted: 11/12/2014 02:14 AM IST
Lions afraid with porcupine in south africa zoo

రజినీకాంత్ హీరోగా వచ్చిన ‘శివాజి’ సినిమాలో ‘నాన్న, పందులే గుంపులుగా వస్తాయి.. సింహం సింగిల్ గా వస్తుంది’ అనే డైలాగ్ ఎంత పాపులరో చెప్పనక్కర్లేదు. ప్రతి ఒక్కరూ తమ గొప్పతనం చెప్పుకోవటానికి ఇప్పటికీ ఈ డైలాగ్ వాడుకుంటున్నారు. అయితే ఈ వార్త చదివితే మాత్రం డైలాగ్ రివర్స్ లోకి మార్చుకోక తప్పదు. అంటే ‘సింహాలే గుంపులుగా వచ్చాయి, పంది సింగిల్ గా వచ్చింది’ అనాల్సిందే. దక్షిణాఫ్రికాలోని క్రూగర్ జూలో ఆరేళ్ళ క్రితం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో యూ ట్యూబ్ లో హల్ చల్ చేస్తోంది.

క్రూగర్ జూ లోని అభయారణ్యంలో ఓ రోజు రాత్రి 13 సింహాలు ముళ్ళపందిని చూశాయి. వెంటనే దాడి చేసేందుకు దాని దగ్గరకు వచ్చాయి. అయితే సింహాలను చూసి ఏ మాత్రం జంకని ముళ్ళపంది, వాటికి ఎదురుతిరిగింది. పదునైన తన ముళ్ళతో ఎదురుదాడి చేసింది. పదమూడు సింహాలు కలిసి ఏ వైపు నుంచి వచ్చినా వాటిపై ముళ్ళతో విరుచుకుపడింది. రాత్రి నుంచి తెల్లవారే వరకు సింహాలు దాడి చేసేందుకు విఫలయత్నం చేశాయి. ముళ్ళపంది ముప్పుతిప్పలు పెట్టడంతో వాటికి మూడు చెరువుల నీళ్ళు తాగినంత పని అయింది.

చివరకు తెల్లవారుతుండగా కూడా చివరి ప్రయత్నంగా దాడికి ట్రై చేశాయి. కాని మళ్ళీ సేమ్ సీన్ రిపీట్ అయింది. దీంతో చేసేది లేక, టైం బ్యాడ్ అనుకుని వెళ్ళిపోయాయి. ఈ వీడియోను నేషనల్ జియోగ్రాఫిక్ చానెల్ యూట్యూబ్ లో అప్ లోడ్ చేసింది. ఇప్పటివరకు ఈ వీడియోను ఇరవై లక్షలకు పైగా చూశారు. అడవికి రాజైన సింహాన్ని తరిమికొట్టిన ముళ్ళపంది ధైర్యానికి వీక్షకులు కామెంట్ల ద్వారా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక మీరూ ఈ వీడియో చూడండి.

 

 

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Porcupine  lions  zoo  wild life  latest news  

Other Articles