50 indian men feel violence against women endemic to happy family

adults, Domestic violence, Education, Family, gender discrimination, poverty, physical, relationship, sexual violence, Substance abuse, United Nations Population Fund Agency, UNFPA

50% Indian men feel violence against women endemic to happy family

భారత్ లో భార్యా హింసకుల సంఖ్య ఎక్కువే..

Posted: 11/11/2014 06:30 PM IST
50 indian men feel violence against women endemic to happy family

భారత్ దేశంలో స్త్రీకి సముచిత స్థానం వుంది. యత్న నార్యంతు ప్యూజ్యంతే.. తత్ర రమ్యంతే దేవతాం అంటూ.. విశ్వసించిన ఫుణ్యభూమి. అయినా.. అడవారని కూడా చూడకుండా, సహదర్మఛారిని అని అలోచించకుండా మగవాడు వారిని హింసిస్తున్నాడు. తల్లిలా సేవ చేసి, చెల్లిలా ఓదార్చి, మంత్రిలా సలహాలు ఇచ్చి, గురువులా నియమనిబంధనలు పెట్టి, భర్తే సర్వస్వం అని నమ్మి వచ్చిన ఆడవారిపై.. భారతీయ పురష అహంకార సమాజం కత్తిని పెడుతోంది. వారిని కూరలో కరివేపాకులా తీరిసారేస్తుంది. ఇది నిజం. అంతర్జాతయంగా జరిగిన సర్వేలో వెల్లడైన వాస్తవం.

ప్రతి పదిమంది భారతీయ భర్తల్లో ఆరుగురు తమ భార్యలను హింసిస్తామని అంగీకరించినట్లు ఐక్యరాజ్యసమితి అధ్యయనంలో తేలింది. అందులోనూ చిన్నతనంలో వివక్ష ఎదుర్కొన్న, ఆర్థిక సమస్యలు అనుభవించిన వారే ఎక్కువగా తమ భాగస్వామిని హింసిస్తున్నారని సోమవారం విడుదలైన ఈ అధ్యయనం పేర్కొంది. యునైటెడ్ నేషన్స్ వరల్డ్ పాపులేషన్ ఫండ్, ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ వుమెన్ సంస్థలు సంయుక్తంగా ఈ నివేదిక రూపొందించాయి. సర్వేలో భాగంగా దేశంలోని ఏడు రాష్ర్టాల్లో 18 నుంచి 49 ఏండ్ల వయసున్న 9205 మంది పురుషుల అభిప్రాయాలను సేకరించారు. పురుషత్వం, భాగస్వామిని హింసించడం, కొడుకుకే ప్రాధాన్యం అన్న అంశాలపై వీళ్ల అభిప్రాయాలను తెలుసుకున్నారు. అవమానించడం, భయపెట్టడం, బెదిరించడం, శారీరకంగా, మానసికంగా వేధించడంలాంటి అంశాలన్నింటినీ హింసలో భాగంగానే పరిగణించారు.

ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్న వారే ఎక్కువగా భాగస్వామిని హింసించినట్లు తేలింది. ఇంటిని నడిపే బాధ్యత మగవారిదే అన్న భావన కారణంగానే ఇలా జరిగి ఉండవచ్చు అని నివేదిక అభిప్రాయపడింది. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా, ఒడిశా, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలలో ఈ అధ్యయనం చేశారు. అత్యధికంగా ఒడిశా, ఉత్తరప్రదేశ్‌లలో 70 శాతం మంది మగవారు తమ భాగస్వాములను హింసిస్తున్నామని అంగీకరించడం గమనార్హం. భారత్‌లో గతేడాది మహిళలపై జరిగిన హింసలో 38 శాతం.. భర్తలు, వారి తరఫు బంధువుల వల్లే జరిగిందని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తెలిపింది. ఈ అధ్యయనంలో భాగంగా 3158 మంది మహిళలను కూడా సర్వే చేశారు. వీరిలో 52 శాతం మంది తమ జీవితకాలంలో ఏదో ఒకరకంగా భాగస్వామి హింసను అనుభవించినట్లు చెప్పారు. ఇందులోనూ శారీరకహింస అంటే కొట్టడం, తన్నడం, కిరోసిన్ పోసి తగులబెట్టడంలాంటివే ఎక్కువగా నమోదయ్యాయి.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles