Sujana chowdary sworn in as union minister for state

sujana chowdary, sworn in, union minister for state, cabinet expansion, yalamanchili satyanarayana chowdary, TDP, Rajya sabha

sujana chowdary sworn in as union minister for state

కేంద్ర సహాయ మంత్రి సుజనాచౌదరి ప్రమాణం

Posted: 11/09/2014 05:06 PM IST
Sujana chowdary sworn in as union minister for state

టీడీపీ నాయకుడు సుజానా చౌదరి తొలిసారిగా కేంద్ర కేబినెట్ లో దక్కించుకున్నారు. కేంద్ర సహాయ మంత్రిగా ఆయన ఇవాళ ప్రమాణస్వీకారం చేశారు. పారిశ్రామికవేత్తగా ప్రస్థానం ప్రారంభించిన ఆయన తర్వాత రాజకీయాల వైపు అడుగులు వేశారు. చంద్రబాబుకు సన్నిహితంగా ఉంటూ టీడీపీలో వడివడిగా ఎదిగారు. రాజ్యసభ సభ్యుడిగా పార్లమెంట్ లో అడుగుపట్టిన ఆయన కేంద్ర మంత్రి పదవి దక్కించుకున్నారు. ఇప్పటివరకు పత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనప్పటికీ రాజ్యసభ ఎంపీగా వున్న ఆయనను కేంద్ర మంత్రి పదవి వరించింది

సుజనా చౌదరి పూర్తి పేరు యలమంచిలి సత్యనారాయణ చౌదరి, ఆయన 1961 జూన్ 2న జన్మించారు. ఆయన తల్లిదండ్రులు జనార్దనరావు, సుశీల కుమారి, ఆయన సతీమణి పద్మజ, ఒక కుమారుడు, కుమార్తె కలిగిన ఆయన ఇంజనీరింగ్ లో మాస్టారు పట్టాను పుచ్చుకున్నారు. పారిశ్రామిక వేత్తగా ఖ్యాతి గడించిన ఆయనకు టీడీపీలో చేరి తన రాజకీయ జీవితానికి అంకురార్పన చేశారు. అనతి కాలంలో ఆయనను కేంద్రమంత్రి పదవి వరించింది.

సుజనా గ్రూప్ కంపెనీల వ్యవస్థాపకుడిగా రాష్ట్ర ప్రజలకు పరిచమైన సుజనా చౌదరి తెలుగుదేశం పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. 2010 జూన్ 22న తొలిసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ప్రత్యక్ష ఎన్నికల్లో ఒక్కసారి కూడా పోటీ చేయనప్పటికీ ఆయన దీక్షాదక్షతను మెచ్చిన చంద్రబాబు ఆయనను రాజ్యసభకు ఎంపిక చేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సుజానా చౌదరి అత్యంత సన్నిహితుడు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles