Bandaru dattatreya sworn in as union minister of independent charge for the fourth time

bandaru dattatreya, sworn in, union minister, independent charge, fourth time railways, urban development

bandaru dattatreya sworn in as union minister of inependent charge for the fourth time

నాల్గవసారి కేంద్రమంత్రిగా బండాడరు దత్తత్రేయ ప్రమాణం

Posted: 11/09/2014 05:03 PM IST
Bandaru dattatreya sworn in as union minister of independent charge for the fourth time

నగర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకుని కార్యకర్తలతో నిత్యం సత్సంబంధాలు ఏర్పర్చుకుంటూ ముందుకు సాగుతన్న బండారు దత్తాత్రేయ మరోసారి కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గతంలో ప్రధాని అటల్ బీహారీ వాజ్‌పేయ్ ప్రభుత్వంలో 1999 నుంచి 2004 సంవత్సరాల మధ్య పట్ణణాభివృద్ధి, రైల్వేశాఖా మంత్రిగా సేవలందించారు. ప్రస్తుతం బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడి హోదాలో ఉన్నారు. దత్తాత్రేయ పాతబస్తీలోని గౌలిగూడలో ఓ నిరుపేద కుటుంబంలో 1947 జూన్ 12 తేదిన జన్మించారు. సైన్స్‌లో పట్టబద్రులయ్యారు. ఆయనకు భార్య, ఓ కుమారుడు వైష్ణవ్ బండారు, కూతురు విజయలక్ష్మిలు ఉన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్‌లో ప్రవేశించిన ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ జాతీయ రాజకీయనేతగా స్థాయికి ఎదిగారు.

1965లో ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరిన బండారు దత్తత్రేయ, 1975-77లో లోక్ సంఘర్ష సమితి రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. 1980లో బీజేపీలో చేరిన ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిగా నియామకం అయ్యారు. 1997-98, 2006లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. 2004లో బీజేపీ జాతీయ కార్యదర్శిగా, పార్టీ తమిళనాడు రాష్ట్ర ఇన్‌చార్జిగా బాధ్యతలు నిర్వహించిన ఆయనను మరమారు 2010లో జాతీయ కార్యవర్గంలోకి తీసుకున్నారు. ప్రస్తుతం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడిగా నియామకం. కేరళ ఇన్‌చార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

1991-1996 మధ్య సికింద్రాబాద్ ఎంపీగా తొలిసారి ఎంపికైన దత్తన్న 1998లో మరోసారి సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా గెలిచారు. 1998-1999 మధ్య వాజ్‌పేయి ప్రభుత్వంలో పట్టణాభివృద్ధి శాఖ సహాయమంత్రిగా పనిచేశారు. ఆ తరువాత  1999 సికింద్రాబాద్ ఎంపీగా మూడోసారి విజయం సాధించారు. దీంతో ఆయనకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయమంత్రిగా బాధ్యతలను అప్పగించారు. 2001-2003 రైల్వే శాఖ సహాయ మంత్రి, 2003-04 స్వతంత్ర హోదాలో పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి కూడా బాధ్యతలు నిర్వహించారు. అనంతరం రెండు పర్యాయాలు ఓటమిని చవిచూసిన బండారు 2014 సార్వత్రిక ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రం నుంచి గెలిచిన ఏకైన బీజేపి ఎంపీగా నిలిచారు. అయితే అయన సీనియారిటీకి మరోమారు కేంద్ర మంత్రి పదవి వస్తుందనుకున్నప్పటికీ.. తొలి ప్రమాణ స్వీకారోత్సవంలో కేవలం కొంతమందితోనే ప్రమాణస్వీకారాన్ని ముగించిచారు ప్రధాని మోడీ. ఈ నేపథ్యంలో ఇవాళ జరిగిన రెండవ సారి విస్తరణలో బండారు దత్తన్నకు మళ్లీ స్వతంత్ర హోదాలో కేంద్ర మంత్రి పదవి వరించనుంది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles