Chapatis can t control diabetes study

British Medical Journal, carbohydrates, Diabetes, exercise, Food, India, Lifestyle, Rice, Sedentary Lifestyle, Chapatis, control. diabetes

Chapatis can't control diabetes: Study

చపాతీలతో షుగర్(మధుమేహ)వ్యాధి కంట్రోల్ కాదట..

Posted: 11/08/2014 01:26 PM IST
Chapatis can t control diabetes study

ఇంటికి ఎవరైనా అతిధులు వస్తే.. వారికి ముందగా టీ ఇస్తాం. అయితే ఇప్పటి తరంలో చాలా మంది పంచధార తక్కువగ వేయండి అంటూ సూచిస్తున్నారు. వచ్చిన వారు చిన్ననాటి స్నేహితులవుతే.. చట్టుకున ఒంట్లో ఫుల్ గా పంచధార ఫ్యాక్టరీ పెట్టావా..? ఏంట్రా అని జోక్ చేస్తాం. అదే అంత చనువైన వారు కాకపోతే.. ఏంటి షుగర్ వుందా..? మరి నియంత్రణకు ఏం తీసుకుంటున్నారు. మాత్రల దశలోనే వున్నారా..? లేక ఇంజక్షన్ ధశకు చేరుకున్నారా..? అంటూ ఆరా తీస్తాం. ఎన్నాళ్లవుతుంది మీకు షుగర్ వ్యాది వచ్చి అంటూ ఫలానా మందులు వాడితే కంట్రలో అవుతుంది. ఫలానా ఆహారం తీసుకుంటే నియంత్రణలో వుంటుందని చెబుతాం. ఆ ఫలానాలో చపాతీలు లేదా పుల్కలు (నూనే వేయకుండా చేసే చపాతి) తింటే  తక్కువవుతుందని చెబుతాం. కానీ ఇక మీదట అలా చెప్పకండి..? ఎందుకంటరా..? చపాతీలతో షుగర్ (మదుమేహ) వ్యాధి కంట్రెల్ కాదు కాబట్టి.

చపాతీలతో మధుమేహ నియంత్రణ అపోహేనని వైద్యనిపుణులు తేల్చేశారు. దేశవ్యాప్త అధ్యయనంలో ఈ వాస్తవం వెల్లడైందని ముంబె మధుమేహ నిపుణుడు డాక్టర్‌ శశాంక్‌ జోషి తెలిపారు. దక్షిణ భారతంలో అన్నం, ఇడ్లీ వంటి అధిక కార్బొహైడ్రేట్ల(పిండిపదార్థం)తో కూడిన ఆహారాన్ని తీసుకుంటారు. అయి తే, ఉత్తరాది ప్రజల ఆహారం చపాతీ, రోటీవంటివాటిలో కార్బొహైడ్రేట్లు తక్కువని భావిం చేవారు. అయితే, దక్షిణాది ఆహారంలో 62.3 శాతం కార్బొహైడ్రేట్లు ఉంటే, ఉత్తరాదిలో 62.7శాతం, మధ్య భారతంలో 67.2, ఈశాన్యంలో 65 శాతం ఉందని సర్వేలో తేలింది.

మొత్తంమీద భారతీయులు ఆహారంలో సగటున 64.1 శాతం కార్బొహైడ్రేట్లను తీసుకుంటున్నారని వెల్లడైంది. మానవుల ఆహారంలో 55 నుంచి 60 శాతం కార్బొహైడ్రేట్లు, 10 నుంచి 15 శాతం ప్రొటీన్లు, 20-25శాతం కొవ్వుపదార్థాలు ఉంటే సరిపోతుందని జోషి తెలిపారు. అయితే, భారతీయుల ఆహారంలో కార్బొహైడ్రేట్లు ఎక్కువ, ప్రొటీన్లు, పీచుపదార్థాలు తక్కువని, ఇది ఆరోగ్యానికి మంచిదికాదని వివరిస్తున్నారు. పచ్చగా వున్న కూరగాయలన్నింటిలోనూ సెల్యులోజ్ రూపంలో ఫీచు పదార్థం వుంటుంది. దీనితో పాటు కూరగాయాల చెక్కుల్లోనూ, గింజల్లోనూ పీచు ఉంటుంది. గోరు చిక్కుళ్లు, బఠాణీలు, ఉల్లికాడలు, వంకాయ (గింజలు అధికంగా వున్నవి) సొరకాయ, బీరకాయ, కాకర (చెక్కు తీయకుండా)లతో పాటు బెండ, దోండ, కాకర గింజల్లోనూ పీచు అధికంగా వుంటుందని ఇది మదుమేహాన్ని నియంత్రిస్తుందని వైద్యులు చెప్పారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles