Nj naturalist paul rosolie becomes lunch for anaconda in discovery special

Discovery Channel, Air, Wildlife, Filmmaker, NJ naturalist, Paul Rosolie, getting Eaten, becomes lunch, Anaconda, December 7th

NJ naturalist Paul Rosolie becomes lunch for anaconda in Discovery special

అనకొండకు సజీవ ఆహారం కానున్న పాల్ రొపోలి..

Posted: 11/08/2014 12:39 PM IST
Nj naturalist paul rosolie becomes lunch for anaconda in discovery special

అతని పేరు పాల్‌ రొసోలీ. జంతు ప్రేమికులకు ఈయన సుపరిచితుడే. పాల్‌ రొసోలీ అమెరికాకు చెందిన పర్యావరణ ప్రేమికుడు, సాహసి! అనకొండతో ఆడుకున్న అనుభవం ఆయన సొంతం. ఇప్పడే ఈయనకు ఓ దర్మ సందేహం కలిగింది. అనకొండ జంతువుల్ని అమాంతం మింగేసి.. ఎలా జీర్ణం చేసుకుంటోందని. అంతే మరో సాహహానికి రోపోలి శ్రీకారం చుట్టాడు. ఏకంగా అనకోండ నోట్లోకి సజీవంగా వెళ్లి అదెలా జంతువుల్ని మింగేస్తుందో తెలుసుకుంటానంటున్నాడు. బహుశా... అనకొండా నోట్లోకి సజీవంగా వెళ్తున్న మొట్టమొదటి వ్యక్తిని నేనే! త్వరలోనే ఈ దృశ్యాలు మీరు చూడొచ్చు’... అంటూ ఇంటర్నెట్‌లో ప్రకటన కూడా పోస్ట్ చేశాడు. పాల్ రోపోలీ చేస్తున్న సహాసం పెను సంచలనమే సృష్టించింది.

రోట్లో తలపెట్టినట్లుగా... అనకొండ నోట్లో తలపెట్టడమేంటిరా బాబూ అంటూ అతని సాహసాన్ని అపాలని చూసినా.. అతడు వినే పరిస్థితుల్లో లేడు. ఎందకంటే అయిన ఈ వ్యవహారాన్ని పూర్తి చేసేందుకు అన్ని కార్యక్రమాలు ప్లాన్ చేసుకున్నాడు. అంతేకాదు రొసోలీ అనకొండకు ఆహారమయ్యే కార్యక్రమం డిస్కవరీ చానల్‌ ప్రసారం చేస్తుందట! ట్విట్టర్‌లో రొసోలీ 30 క్షణాల వీడియో ప్రకటన చేయగా... ఈ కార్యక్రమం వచ్చేనెల డిసెంబర్ 7న ప్రసారం చేస్తామని డిస్కవరీ చానల్‌ అధికార ప్రతినిధి యూట్యూబ్‌లో ధ్రువీకరించారు.

అనకొండ నోట్లో రొసోలీ తల పెట్టడం ఖాయం! కానీ... ఆయనకు ప్రాణాలకు మాత్రం అపాయం ఉండదు! ఎందుకంటే... ఆయన బుల్లెట్‌ ప్రూఫ్‌ సూట్‌లాగా, రాకాసిపాము మింగేసినా తనకు ఏమీకాని విధంగా ‘స్నేక్‌ ప్రూఫ్‌ సూట్‌’ ధరిస్తాడు. ఆయన చెప్పినట్లుగానే... సజీవంగా అనకొండ నోట్లోకి వెళ్లి, అది ఆహారాన్ని ఎలా మింగుతుందో చిత్రీకరిస్తాడు. సజీవంగానే తిరిగి వస్తాడు. ఈ విషయాన్ని అతను యూట్యూబ్‌లో పెట్టిన మరో వీడియోలో స్పష్టం చేశాడు. ఈ వీడియోలో అతను స్నేక్‌ ప్రూఫ్‌ సూట్‌ ధరించాడు! ‘నీ ప్రాణాల సంగతి దేవుడెరుగు. ఇలాంటి సూట్‌ వేసుకున్న నిన్న మింగితే అనకొండా ప్రాణాలకు ముప్పు రావొచ్చు. ఈ కార్యక్రమాన్ని నిలిపి వేయండి’ అంటూ జంతువులు హక్కుల కోసం పోరాడే ‘పెటా’ డిస్కవరీ చానల్‌నుడిమాండ్‌ చేసింది.
 
జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles