Interesting discussion between ktr mallu bhatti vikramarka in asembly premises

telangana assembly, ktr, mallu bhatti vikramarka, Khammam, minister,

interesting discussion between ktr mallu bhatti vikramarka in asembly premises

వాళ్లు అమాయకులట.. వారికేం తెలియదట.. మరెవరికి తెలుసట..

Posted: 11/07/2014 04:09 PM IST
Interesting discussion between ktr mallu bhatti vikramarka in asembly premises

ఆయన ప్రస్తుతం రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి, కానీ ఆయన అమాయకుడట ఆయనకేం తెలియదట. మంత్రులుగా వున్నవారు అమాయకులైతే, నిజంగా వారికేం తెలియకపోతే.. దాని ప్రభావం.. మొత్తం రాష్ట్ర ప్రజలపై పడుతోంది. ఆయన అమాయకత్వంతో అధికారులు ఏం చెబితే వాటినే పరిగణలోకి తీసుకుని నిర్ణయాలు వెల్లడిస్తే మొత్తానికే మోసం వస్తుందన్న అందోళన కూడా ప్రజల్లో నెలకొంటుంది. ఇంతకీ ఆ మంత్రి ఎవరో చెప్పండి అమాయకుడో..కాదో మేం చెబుతామంటరా...?

విదేశాలలో నెలకు లక్షల రూపాయల వేతనాన్ని వదిలపెట్టి.. తెలంగాణ ఉద్యమం పట్ల ఆకర్షితుడై.. ఉద్యమంలో సాదారణ సైనికుడిగా వుంటూనే.. అమాత్యుల స్థాయి వరకు ఎదిగిన నేత. ఆయనే కల్వకుంట తారాక రామారావు. టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు. కేటీఆర్ ఎంటీ అమాయకుడేంటనేగా మీ డౌట్..? అవునండీ ఆయన  అమాయకుడట. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే చెప్పారు. అంతేకాదు తనకేం తెలియదని కూడా చెప్పారు. ఎక్కడంటారా..?

అసెంబ్లీ ఆవరణలో ఇవాళ మంత్రి కేటీఆర్ వస్తున్న దారిలో.. కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు భట్టి విక్రమార్క ఆయనకు తారసపడ్డారు. దీంతో ఇద్దరి మధ్య ఆసక్తికర చర్చ సాగింది. ఖమ్మం జిల్లాలోని 7 మండలాలను సీమాంధ్రలో కలిపిన పాపం కాంగ్రెస్ పార్టీదేననంటూ..మల్లు భట్టివిక్రమార్కను ఉద్దేశించి కేటీఆర్ వ్యాఖ్యానించారు. మంత్రిగా కేటీఆర్ కు గౌరవాన్నిస్తూనే విక్రమార్క ఖమ్మం జిల్లా మండలాలు సీమా:ద్రలో విలీనం చేయడానికి గల నిజమైన కారణం చెప్పమంటావా అని ఎదురు ప్రశ్న వేశారు. 1952కు ముందున్న తెలంగాణ కోరింది మీరేనని ఈ సందర్భంగా మల్లు గుర్తు చేశారు. అందుకు ప్రతిగా కేటీఆర్ ...మేం అమాయకులం... మాకేం తెలియదంటూ నవ్వుతూ సమాధానమిచ్చారు. దీంతో అక్కడ ఒక్కసారిగా నవ్వులు విరబూసాఃయి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telangana assembly  ktr  mallu bhatti vikramarka  Khammam  minister  

Other Articles