Imran khan praises narendra modi over black money issue

imran khan, narendra modi, black money, pakistan, Pakistan Tehreek-e-Insaf, india, Primi minister, Maan ki baath

imran khan praises narendra modi over black money issue

ప్రధాని మోడీపై పాకిస్థాన్ తెహ్రిక్ ఇ ఇన్సాఫ్ ప్రశంసలు

Posted: 11/07/2014 03:16 PM IST
Imran khan praises narendra modi over black money issue

పాకిస్థాన్ విపక్ష నాయకుడు, తెహ్రిక్ ఇ ఇన్సాప్ పార్టీ అధినేత ఇమ్రాన్ఖాన్ భారత ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసలు కురిపించారు. విదేశీ బ్యాంకుల నుంచి నల్లధనాన్ని తెప్పించడానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలు అద్భుతమని పొగిడారు. మోడీ గురించి ఎవరేం చెప్పినా తాను నమ్మబోనన్నారు. ఆయనంతటి అత్యంత విశ్వసనీయుడని భారత్ ప్రధాని కావడం, భారత్ చేసుకున్న అదృష్టంగా వ్యాఖ్యానించారు. నల్లధనం వెనక్కు తీసుకురావడంలో తన చిత్తశుద్దిని నమ్మలని ఆయన మన్ కీ బాత్ ద్వారా భారత ప్రజలకు ఇచ్చిన మాటలో అయన దృడసంకల్పం స్పష్టమవుతోందని ప్రశంసించారు.

ఒకప్పుడు క్రికెటర్గా ఉండి, తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించిన ఇమ్రాన్ఖాన్.. పాకిస్థాన్లో కూడా నల్లధనాన్ని వెనక్కి తెప్పించే ప్రయత్నాలు చేయాలని చెప్పారు. భారత్ తరహాలో పాకిస్థాన్ లోనూ అనేక మంది విదేశాలలో డబ్బులు దాచుకున్నారని అరోపించారు. వాటిని కూడా దేశానికి రప్పిస్తే.. పాకిస్థాన్ కూడా అభివృద్దిలో దూసుకుపోతుందన్నారు. పాకిస్థాన్ నాయకుడు ఒకరు భారత నేతలపై ఇంతగా ప్రశంసలు కురిపించడం మాత్రం ఇదే తొలిసారి. నవాజ్ షరీఫ్ ప్రభుత్వం 2013 ఎన్నికల్లో రిగ్గింగ్కు పాల్పడిందని ఆరోపిస్తూ ఇమ్రాన్ ఖాన్ ఆగస్టు నెలనుంచి ఉద్యమిస్తున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles