Pakistan taliban now issues direct threat to indian prime minister narendra modi

pakistan taliban, Tehreek-e-Taliban, Pakistan Jamaat Ahrar, Ehsanullah Ehsan, issues direct threat, indian prime minister, narendra modi

pakistan taliban now issues direct threat to indian prime minister narendra modi

ఎంతటి బరితెగింపు..! ప్రధానినే టార్గెట్ చేస్తారా..?

Posted: 11/06/2014 10:41 AM IST
Pakistan taliban now issues direct threat to indian prime minister narendra modi

భారత ప్రధాని నరేంద్రమోడీపై పత్రీకారం తీర్చుకుంటాం, తమ తదుపరి లక్ష్యం భారతేనంటూ తెహ్రీక్-ఈ-తాలిబన్ పాకిస్థాన్ జమాత్ అహ్రార్ (టీటీపీ-జేఏ) ఉగ్రవాద సంస్థ బరితెగింపు వ్యాఖ్యలు చేయడానికి కారణం భారతీయుల సహనమా..? లేక భారతీయులోని సంయమనమా అన్నది అర్థం కావడం లేదు. ఏకంగా 120 కోట్ల మంది ప్రజలకు ప్రతినిధిగా వున్న ప్రధాన మంత్రిపైనే మాటలతో కవ్వింపులకు పాల్పడటం.. ఉగ్రవాదులు అవివేకమనాలా..? లేక వారిది దుస్సాహమని, కేవలం మేకపోతు గాంభీర్యమని నిమ్మకుండాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. చేతుల్లో తుపాకులు వున్నాయి, వంటి నిండా మత చాందసవాదం పులుపుకున్నామని భారతపై ఇష్టానుసారం ఎవరికి తోచిన విధంగా ఆయా ఉగ్రవాద సంస్థలు ప్రకటనలు చేస్తున్నాయి... ఇక తమ తదుపరి లక్ష్యం భారత్ అంటూ ఊంకరిస్తుంటే.. భారతీయులను భయాందోళనకు గురిచేస్తుంటే.. ఎంతకాలం భారతీయులు మాత్రం శాంతి జపం చేస్తుంటారు. భారతీయుల రౌద్రం కట్టలు తెంచుకుంటే.. దానిని ఆపడం పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల వల్ల అవుతుందా..?

వాఘా సరిహద్దులో ఆత్మాహుతి దాడితో మారణహోమం సృష్టించిన తెహ్రీక్-ఈ-తాలిబన్ పాకిస్థాన్ జమాత్ అహ్రార్ (టీటీపీ-జేఏ) ఉగ్రవాద సంస్థ బరితెగింపు వ్యాఖ్యలు చేసింది. తమ తదుపరి లక్ష్యం భారత దేశమేనని పాక్ తాలిబన్ సంస్థ ప్రతినిధి ఎహ్‌సానుల్లా ఎహ్‌సాన్ ప్రకటించాడు. ప్రధాని నరేంద్ర మోదీపైన కూడా పగ తీర్చుకుంటామని కూడా వ్యాఖ్యాలు చేశాడు. చేసిన ఈ ప్రకటన నేపథ్యంలో భారత, పాకిస్థాన్ సరిహద్దు వెంబడి సైన్యాన్ని భద్రతా సంస్థలు వెంటనే అప్రమత్తం చేశాయి. ప్రధాని భద్రతపై ఎప్పటికప్పుడు సమీక్ష జరుగుతోందని, ఏ ఉగ్రవాద సంస్థా ప్రధానికి ముప్పు తలపెట్టజాలదని  ఢిల్లీలో అధికారవర్గాలు స్పష్టంచేశాయి.

కేవలం సంచలనం కోసమే తెహ్రీక్-ఈ-తాలిబన్ ప్రధాని లక్ష్యంగా ఇలాంటి బెదిరింపులకు పాల్పడుతోందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. సరిహద్దులో పాకిస్థాన్ వైపు వాఘావద్ద ఆదివారంనాటి దాడిలో 57 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి తామే బాధ్యులమని టీటీపీ ప్రకటించింది. రాయ్‌టర్స్ వార్తా సంస్థతో రహస్య ప్రాంతం నుంచి  తాలిబన్ ప్రతినిధి ఎహ్‌సానుల్లా ఎహ్‌సాన్ ఫోన్లో మాట్లాడుతూ తాజా హెచ్చరిక చేశాడు. సరిహద్దులో ఒకవైపున ఆత్మాహుతి దాడి చేయగలిగిన తమకు మరోవైపున ఇండియాలో కూడా దాడి చేయడం కష్టం కాదని, భారత్‌పైనా దాడి చేయబోతున్నామని ఇప్పటికే భారత ప్రధాని మోదీకి తెలియజేశామని చెప్పాడు. మత చాందసవాద మత్తులో జోగుతూ హింసను ప్రేరేపిస్తున్న ఉగ్రవాదుల బెదిరింపులకు భారతీయులు ఎప్పడు జంకలేదు. ఎన్నో ఏళ్లుగా పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు అనేక హింసాత్మక ఘటనలకు పాల్పడినా.. ఓర్పుతో వుంది. సహనంతో వేచి చూస్తోంది. సహనం నశిస్తే.. భారతీయుడు తిరగబడితే.. పరిణమాలు ఏలా వుంటాయన్నది కూడా ఉగ్రవాదులు ఊహించుకోవాలి.

జీహాదీ అంటూ గొంతు చించుకునే ఉగ్రవాదులు.. ఏ హక్కుతో ప్రజల మాన ప్రాణాలను కబళిస్తున్నారు. ఏ దైవం వారికి అమాయకుల ప్రాణాలను బలికొరమని చెప్పింది. హింసను చూసి చూసి బాగా అలవాటు పడిన ఉగ్రవాదులు.. ధైర్యంగా తమ శత్రువలతో ఎదురొడ్డి పోరాటం చేయలేరు. కేవలం బాంబు దాడులు, ఆత్మహుతి దాడులు ఇత్రరాత్ర రూపేన.. దొంగ దెబ్బ తీయడానికే యత్నిస్తుంటారు. దొంగచాటుగా మాటు వేసి బాంబుపేల్చే సంస్కృతేనా జీహాదీ అంటే..? మానవత్వం ఏ కోశానా లేకుండా..? పసి వారి నుంచి వృద్దుల వరకు విస్ఫోటనాలతో విరుచుకుపడటమేనా పవిత్ర యుద్దమంటే..? శత్రువుకు ఎదురుగా నిలబడి పోరాటం చేసి, నువ్వా నేనా అన్నట్ల తేల్చుకోగలరా..? తాము చేస్తున్నది మంచో, చెడో తెలియని మూర్ఖత్వం ఉగ్రవాదులది. ఇది పక్కన బెడితే...

భారత ప్రధాని నరేంద్రమోడీని చూసి ప్రపంచ దేశాలు.. కొత్త ఒరవడి శ్రీకారం చుడుతున్నాయి. మోడీ ఎలా అడుగులు వేస్తే అలా.. తామూ వేసి..ఆయనతో పాటు అభివృద్ది బాటలో తామూ ముందుకు సాగుదామని ప్రయత్నిస్తున్నాయి. ఇది ప్రగతికి సంకేతం. అయితే నరనరాన ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న ఉగ్రవాదులు మాత్రం కాశ్మీర్ వేర్పాటువాదులు, గుజరాత్‌కు చెందిన అమాయకుల రక్తంతో చేతులు తడుపుకున్న మోదీ కూడా పరిహారం చెల్లించాలని హెచ్చరించామన్నాడు. మోదీపైన ప్రతీకారం తీర్చుకుంటామంటూ ఎహ్‌సాన్ అంతకు ముందు ట్విట్టర్లో పేర్కొన్నాడు. ఆ ట్విట్టర్ ఖాతా నిజమైనదేనని భారత నిఘా అధికారి ఒకరు ధ్రువీకరించారు. భారత్ లో అమాయక ముస్లింల మరణాల అంశం తెరపైకి వచ్చినప్పుడు.. ఉగ్రవాదులు జరిపే బాంబు దాడుల్లో కూడా అనేకమంది అమాయక ముస్లింలు ప్రాణాలను కోల్పోయారు. మరి కోంత మంది జీవశ్చవాలుగా బతుకులు ఈడుస్తున్నారు. వీరి మరణాలకు, దుర్భర జీవితాలకు ఎవరిపై పగ, ప్రతీకారాలు తీర్చుకోవాలి..? మత చాందసవాద మూర్ఖత్వంతో రాజ్యమేలాలనకుంటే.. కేవలం శ్మశాన వాటికలు.. అక్కడక్కడ విగత జీవులైన వారు తప్ప ప్రజలు వుండరన్న విషయాన్ని ఉగ్రవాదులు గుర్తుంచుకోవాలి. హింసామార్గాన్ని వీడి సన్మార్గంలో నడవాలి.

 
జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles