Minister ganta srinivasara rao complaint against loans with fake pattadar pass books

Ganta Srinivasarao, loans, fake tracks

minister ganta srinivasara rao complaint against loans with fake pattadar pass books

అమాత్యుల భూములకే ఎగనామాలు పెట్టిన కేటుగాళ్ల..

Posted: 11/04/2014 10:37 AM IST
Minister ganta srinivasara rao complaint against loans with fake pattadar pass books

నకిలీ డాక్యూమెంట్లు సృష్టించి.. సదరు భూములను వివాదాస్పద భూములుగా మార్చి.. అసలైన యాజమాన్య హక్కులు వున్న వారిని ముప్పుతిప్పలు పెట్టి చివరకు ఎంతొ కొంత లబ్ధి పోందే అక్రమార్కులు రోజు రోజుకు రాష్ట్రంలో విస్తరిస్తున్నారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు పదేపదే అడుగుతున్నా.. వారిపై చర్యలను ఎలా తీసుకోగలమని ఎదురు ప్రశ్నిస్తున్నారు ప్రభుత్వ అధికారులు. రాష్ట్ర విభజనతో కొత్త రాజధాని ఏర్పాటు ప్రాంతం విజయవాడ, గుంటూరు సహా విశాఖపట్నంలోనూ ఈ తరహా కేసులు నానాటికీ పెరిగిపోతున్నాయి. చివరకు అవి ఎంతవరకు చేరాయంటే.. ఏకంగా రాష్ట్ర మంత్రికి చెందిన భూములకే ఎగనామాలు పెట్టే స్థాయికి చేరాయి. ఇంతకీ ఎవరాయన అనేగా మీ డౌట్..

ఉమ్మడి రాష్ట్రంలోనూ మంత్రిగా పనిచేసి.., తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా వ్యవహరిస్తున్న గంటా శ్రీనివాసరావుకే ఈ కేటుగాళ్ల ఘటన ఎదురైంది. తన సంబంధీకులకు చెందిన భూములకే నకిలీ డాక్యూమెంట్లు సృష్టించిన కేటుగాళ్లు.. లక్షల రూపాయలను బ్యాంకుల నుంచి రుణాలను తీసుకున్నారు. కావలి రెవెన్యూ డివిజన్‌లోని కొండాపురం మండలం పొట్టిపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన సమయంలో గంటా సంబంధీకులు పొట్టిపల్లిలో సుమారు 60 ఎకరాలను కొనుగోలు  చేసినట్లు సమాచారం. అయితే కొందరు వ్యక్తులు ఆ భూములకు పట్టాలు సృష్టించి గరిమెనపెంట సహకార సంఘంలో రూ. 17 లక్షల వరకు రుణం తీసుకున్నారు.

అలాగే కలిగిరి మండలం అన్నలూరు ఎస్‌బీఐలో లోన్లు తీసుకున్నారు. ఎర్రబల్లి యూనియన్ బ్యాంక్‌లోనూ రూ.10 లక్షల వరకు లోన్ తీసుకున్నారు. ఈ విషయాన్ని ఇటీవలే గుర్తించిన మంత్రి గంటా అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. దీంతో రెవెన్యూ అధికారులు విచారణ చేపట్టారు. కావలి ఆర్డీఓ లక్ష్మీనరసింహం స్పందిస్తూ గంటా భూముల వివాదం తమ దృష్టికి వచ్చిందన్నారు. నకిలీ పట్టాలు సృష్టించి రుణాలు తీసుకున్న వారికి నోటీసులు జారీ చేశామన్నారు. అయితే మంత్రి కాబట్టి గంటా భూములకు నకిలీ డాక్యూమెంట్లు సృష్టించి రుణాలు తీసుకున్న కేటుగాళ్లులపై తక్షణ చర్యలకు ఉపక్రమించిన అధికారులు.. సామాన్యుల విషయంలో ఎందుకు కల్పించుకోరని విమర్శలు పెద్ద ఎత్తున వినబడుతున్నాయి. ఇప్పటికనా అధికారులు ఈ తరహా నకిలీ డాక్యూమెంట్లను సృష్టించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ganta Srinivasarao  loans  fake tracks  

Other Articles