Telangana government to approch appellate tribunal on krishna river management board decision

Telangana government, chief minister, KCR, approch, Appellate Tribunal, Krishna river management board, decision, power crisis, Union minister, Uma Bharathi

Telangana government to approch Appellate Tribunal on Krishna river management board decision

అపిలేట్ ట్రిబ్యూనల్ ను ఆశ్రయించనున్న తెలంగాణ సర్కార్..

Posted: 11/02/2014 05:24 PM IST
Telangana government to approch appellate tribunal on krishna river management board decision

శ్రీశైలం జలవిద్యుత్తు ఉత్పత్తి విషయంలో పోరాటం కొనసాగించాలని, కృష్ణా రివర్ బోర్డు ఇచ్చిన ఆదేశాలపై అప్పిలేట్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అప్పిలేట్ ట్రిబ్యునల్ చైర్మన్ కూడాఅయిన కేంద్ర మంత్రి ఉమాభారతికి ఇచ్చేందుకు ఒక లేఖను సిద్ధం చేసింది. శ్రీశైలంలో విద్యుదుత్పత్తి విషయంలో కృష్ణా రివర్ బోర్డు ఆంధ్రప్రదేశ్‌కు సానుకూలంగా వ్యవహరిస్తున్నదని ఆ లేఖలో ఆరోపించింది. ఈ వ్యవహారాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని సీఎం కేసీఆర్ సూచించారు.

 ఈ మేరకు ఆర్ విద్యాసాగర్‌రావు నీటి పారుదల శాఖ అధికారులు, న్యాయ నిపుణులతో సుదీర్ఘంగా చర్చించి కేంద్రానికి లేఖ సిద్ధం చేశారు. పునర్విభజన చట్టంలో తెలంగాణకు 54 శాతం, ఆంధ్రాకు 46 శాతం విద్యుత్తు వాడుకోవాలని చాలా స్పష్టంగా ఉన్నప్పటికీ ఏపీ ప్రభుత్వం పాటించటం లేదని లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. గత 60 ఏళ్లుగా తెలంగాణ ప్రాంతానికి నీటి వాటాల్లో జరుగుతున్న అన్యాయాన్ని ఇటీవల జరిగిన సమావేశంలో కృష్ణా రివర్ బోర్డు దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదనే విషయాన్ని ప్రస్తావించినట్టు తెలిసింది.

ట్రిబ్యునల్‌కు తప్ప బోర్డుకు నీటి కేటాయింపులు జరిపే అధికారం లేదనిచ,ఈ విషయంలో ట్రిబ్యునల్ జోక్యం చేసుకోవాలని తెలంగాణ సర్కారు కోరనుంది. మంత్రి హరీశ్‌రావు స్వయంగా ఢిల్లీ వెళ్లి అప్పిలేట్ ట్రిబ్యునల్ ఛైర్మన్ కేంద్ర మంత్రి ఉమాభారతికి లేఖ అందించనున్నారు. ఈ మేరకు కేంద్రమంత్రి అపాయింట్‌మెంట్ తీసుకున్నారు. కృష్ణా జలాల వినియోగంలో కేటాయింపులు జరిపే అధికారం బోర్డు పరిధిలోనిది కాదని, ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకుని స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. నవంబరు 2వ తేదీ వరకు మూడు టీఎంసీల నీటిని వినియోగించాలని కృష్ణా బోర్డు సూచించటం సరికాదన్నారు. 2వ తేదీలోగా మూడు టీఎంసీలు మాత్రమే వాడుకోవాలన్నారు తప్ప. ఆ తర్వాత విద్యుత్తు ఉత్పత్తి నిలిపేయాలని ఎక్కడా పేర్కొన లేదని గుర్తు చేశారు. కేంద్ర మంత్రికి స్వయంగా వెళ్లి లేఖ అందజేస్తామని ఆయన టీ మీడియాతో పేర్కొన్నారు.

 

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles