Gay techie arrested after wife films his encounters with spycam

IT firm, software engineer, anti-gay law, cheating case, homosexual, spy cameras, video footage, homosexual, Section 377, arrest, DCP sandeep patil, Bangalore

Gay techie arrested after wife films his encounters with spy cam

భర్త అకృత్యాలను వీడియో తీసింది.. అరెస్టు చేయించింది..

Posted: 10/31/2014 07:42 PM IST
Gay techie arrested after wife films his encounters with spycam

తన భర్త స్వలింగ సంపర్కుడని తెలిసిన ఆ భార్య అనుకున్నంత పని చేసింది. తన భర్త అకృత్యాలను వీడియోలో రహస్యంగా చిత్రీకరించి.. కటకటాల వెనక్కి నెట్టింది. బెంగుళూరులో డెంటిస్ట్‌గా పనిచేస్తున్న తనకు, మైసూరులోని ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ ఇన్‌ఫోసిస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా విధులు నిర్వహిస్తున్న తన భర్తకు గతేడాది నవంబర్‌లో పెళ్లి జరిగింది. ఆమె వయసు 31 కాగా అతడి వయస్సు 32. వృత్తిరీత్యా పెళ్లయిన మొదటి ఆరు నెలలు ఆమె బెంగుళూరులోనే వుండిపోగా అతడు మైసూరులో వున్నాడు.

అలా మొదటి ఆర్నెళ్లు వాళ్లిద్దరికీ కలిసే ఛాన్స్ రాలేదు. ఆ తర్వాత అతడు బెంగుళూరులోని ఇన్ఫోసిస్‌కు బదిలీ చేయించుకుని అక్కడికి వచ్చాడు. కానీ అప్పటి నుంచి అతను ఆమెని ఒక్కసారి కూడా తాకలేదు. భార్యతో శారీరక సంబంధం పెట్టుకోకుండా దూరంగా వుంటూ వస్తున్నాడు. ఈ విషయంలో ఆమె చాలా అసహనానికి గురైంది. డాక్టర్‌కి చూపించుకుంటే ఏమైనా సమస్యలు పరిష్కరించుకోవచ్చని సలహా ఇచ్చింది. అలా చెప్పిన ప్రతీసారి ఏదో ఓ సాకుతో గట్టిగా అరిచి ఆమే సైలెంట్ అయ్యేలా ప్రవర్తించాడు. ఇక అతడికి చెప్పి లాభం లేదని భావించిన భార్య.. అత్తగారింటికి వెళ్లి ఫిర్యాదు చేసింది. అతడి వీక్‌నెస్ దాచిపెట్టి ఈ పెళ్లి ఎందుకు చేశారని నిలదీసింది.

కానీ అక్కడి నుంచి రివర్స్ సమాధానం వచ్చింది. మా అబ్బాయి మగాడే కానీ నువ్వంటేనే వాడికి ఇష్టం లేనట్లుందని అత్తారింటి వారు ఎదురు తిరిగారు.. అందుకే వాడు నీకు దూరంగా మెలుగుతున్నాడంటూ. ఆరోపించారు. అది చాలదన్నట్లు.. తమ కోడుకు తనతో కాపురం కూడా చేయడానికి ఇష్టపడటం లేదని బుకాయించారు. తక్షణం విడాకులు ఇస్తే.. మావాడికి వేరోక సంబంధం చూసి.. మరో పెళ్లి చేస్తామని సలహా కూడా ఇచ్చారు. అంతేకాదు లేనిపోని మాటలతో అని తిట్టి పంపించారు. ఈ అవమానంతో ఇంటిబాట పట్టిన భార్య బాగా ఆలోచించింది. తమ కొడుక్కి శారీరక లోపం వున్న నిజాన్ని దాచిపెట్టి పెళ్లి చేయడమేకాకుండా.. తనపైనే నిందలేస్తారా అని ఆవేదన చెందింది.

భర్తప్రవర్తనపై అనేకసార్లు అనుమానం కలిగింది. అమ్మాయిల్లాగా లిప్‌స్టిక్ వాడటం, అమ్మాయిల తరహాలోనే రకరకాల రంగులు, డిజైన్లుగల లో దుస్తులు ధరించడం... అన్నింటికి మించి అమ్మాయిల్లాగానే ప్రవర్తించడం వంటివి ఆమెకి అనుమానాన్ని కలిగించాయి. దీనికితోడు రోజూ తాను ఇంట్లో లేని సమయంలో ఆయన ఫ్రెండ్స్‌ ని ఇంటికి తీసుకువస్తున్నాడని ఇరుగుపొరుగు ఫిర్యాదు చేయడంతో తన భర్త స్వలింగ సంపర్కుడా అంటూ అమెకు సందేహాలు రేకెత్తాయి. తన అనుమానాలను నివృత్తి చేసుకోవాలని నిర్ణయించుకుంది. దీంతో పది హిడెన్ కెమెరాలను కొనింది.

ఇంకేం.. వెంటనే బెడ్‌రూమ్, హాల్, కిచెన్, బాత్రూమ్.. ఇలా ఏ ఒక్క చోటు వదలకుండా ఇల్లంతా వాటిని అమర్చింది. కనీసం ఓ 10 రోజులపాటు ఫుటేజీని రికార్డు చేసింది. తాను ఓ వారం రోజులు పుట్టింకి వెళ్లోస్తాను అని భర్తకి చెప్పి వెళ్లిపోయింది. వారం రోజులు గడిచాక భర్త బాగోతాన్ని బయటపెట్టాలనే ఉద్దేశంతో ఇల్లు చేరిన అమె.. ఆ వారం రోజుల ఫుటేజీని చెక్ చేసింది. ఆ ఫుటేజీ చూసి షాకయ్యింది. తాను అనుకున్నదే నిజమైంది. భర్త వేరే మగాళ్లతో కలిసి శృంగారంలో పాల్గొంటున్న దృశ్యాలు ఆ కెమెరాల్లో రికార్డయ్యాయి.

మగతనం లేని వ్యక్తి తనకు అంటగట్టి మోసం చేశాడంటూ... ఈ నిజం తెలిసి కూడా కొడుక్కి పెళ్లి చేసేందుకు దాచిపెట్టారని అత్తామామలతో పాటు భర్తపైనా కేసు పెట్టింది. ఆధారాలతో సహా వచ్చి ఫిర్యాదు చేయడంతో ఆ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు సెక్షన్ 377 కింద అతనిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఈ మోసంలో అత్తామామలకు కూడా భాగస్వామ్యం వుందా అని ఆరాతీస్తున్నారు. ఐపీసీ సెక్షన్ 377 ప్రకారం గే సెక్స్ ఒక నేరం. ఈ నేరం కింద బుక్ అయిన వారికి యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశం వుంది. ఈ సెక్షన్ రాజ్యాంగబద్ధంగా లేదంటూ 2009, జులైలో ఢిల్లీ హై కోర్టు స్పష్టంచేసింది. అయితే, డిసెంబర్ 12, 2013న ఇదే తీర్పుపై అభ్యంతరం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు, ఐపీసీ సెక్షన్ 377 ని సవరించే హక్కు అధికారం పార్లమెంట్‌కే వుంటుంది కానీ జుడీషియల్ అథారిటీకి లేదని పేర్కొంది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles