Doctor jayachandra death mystery

doctor jayachandra death, doctor jayachandra death mystery, doctor jayachandra death case, andhrapradesh latest news, drishyam movie type death of doctor jayachandra, tenali news, death mystery, suspicious deaths

doctor jayachandra death mystery : police starts enquiry on doctor jayachandra death mystery first they want to clarify that death is a suicide or murder. after finding death type only further case investigation will started says tenali dsp vitaleshwar rao

అ‘దృశ్యం’ కధ : అది హత్యా.. ఆత్మహత్యా...?

Posted: 10/28/2014 12:36 PM IST
Doctor jayachandra death mystery

గాంధీ హాస్పిటల్ లో పనిచేసే వైద్యుడు జయచంద్ర అదృశ్యం విషాదాన్ని మిగిల్చింది. ఈనెల 18న రాత్రి కారులో తెనాలికి బయల్దేరిన డాక్టర్... అదృశ్యమయ్యారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలిసులు గాలింపు చేపట్టగా.., దుగ్గిరాల సమీపంలో కృష్ణా పశ్చిమ డెల్టా పరిధిలోని బకింగ్ హామ్ కాల్వలో సోమవారం సాయంత్రం కారు లభ్యమైంది. అయితే కారులో మృతదేహం లేకపోవటంతో అనుమానం వచ్చిన పోలిసులు ఘటానా స్థలం పరిసరాల్లో తీవ్రంగా గాలింపు చేపట్టగా.., రెండు కిలోమీటర్ల దూరంలో జయచంద్ర మృతదేహం లభ్యమయింది.

ఈ కేసు మిస్టరీగా ఉండటంతో విచారణ జరిపేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. విజయవాడ చేరిన తర్వాత జయచంద్ర ఎటు వెళ్లారు, ఎవరిని కలిశారు. ఇంటికి వెళ్ళే ముందు జరిగిన పరిణామాలు, ఇంట్లో వారితో ఏం మాట్లాడారు.. సెల్ టవర్ సిగ్నల్స్ తదితర వివరాల ఆధారంగ కేసు ధర్యాప్తు చేయనున్నారు. అయితే ఇందులో ముందుగా డాక్టర్ చనిపోవటంపై స్పష్టత రావాలని పోలిసులు అంటున్నారు. జయచంద్రది హత్యా... లేక ఆత్మహత్యా.. తేలితేనే విచారణను ఎలా నిర్వహించాలి అనేది తెలుస్తుందని తెానలి డీఎస్పీ విఠలేశ్వర్ రావు వెల్లడించారు. జయచంద్ర గతంలో పలు కారణాలతో ఆత్మహత్య ప్రయత్నం చేయగా కుటుంబ సభ్యులు విషయాన్ని బయటకు పొక్కనీయలేదు. అదేవిధంగా మృతుడికి పలు ఆస్తి తగాదాలతో పాటు, మిత్రులతో కూడా తగాదాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో హత్యా, ఆత్మహత్యా..? అనేది తెలిస్తే విచారణలో పురోగతి ఉంటుంది.

జయచంద్ర కేసు మిస్టరీ ప్రధాన అంశాలు :

* రోడ్డు పక్కన ఉన్న కాల్వలో పడిపోవటంతో ఇది హత్య అని భావించారు.
* కాల్వలో కారు ఉన్నా అందులో జయచంద్ర మృతదేహం లేదు.
* కాల్వ సమీపంలో కూడా కాకుండా రెండు కిలోమీటర్ల దూరంలో శవం లభ్యమైంది.
* గత పరిణామాల నేపథ్యంలో మృతుడు కారును చెరువులో పడేసి ఆత్మహత్య చేసుకున్నాడా..?
* ఎవరైనా హత్య చేసి కారును చెరువులో పడేసి..., అనుమానం రాకుండా మృతదేహం దూరంగా పడేశారా..?
    
    ఇలా ఈ కేసులో అనేక కోణాలు, చాలా అనుమానాలు ఉన్నాయి. ఈ మద్య వచ్చిన ‘దృశ్యం’ సినిమాలో కూడా ఓ యువకుడిని హీరో ఫ్యామిలి చంపేసి తెలివిగా కేసును తప్పుదోవ పట్టిస్తుంది. ఇప్పుడి అదృశ్యం కధ కూడా కాస్త అలాగే అన్పిస్తుంది. మరి ఈ కేసు చివరకు ఎటు వెళ్తుందో.. ఎప్పుడు ముగుస్తుందో చూడాలి.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : doctor jayachandra  death  mystery  enquiry  

Other Articles