Konathala ramakrishna resigns o ysr congress

konathala ramakrishna ysr congress, konathala ramakrishna resigns ysr congress, why konathala resigned ysr congress, latest news, telugu latest political updates, ysr congress leaders, ys jagan latest updates

konathala ramakrishna resigns o ysr congress : senior leader of ysr congress resigned to party political affairs committee member post also wants quit from party

బానిసగా ఉండలేక పార్టీని వీడిన కొణతాల

Posted: 10/28/2014 12:02 PM IST
Konathala ramakrishna resigns o ysr congress

వైఎస్సార్ కాంగ్రెస్ కు విశాఖ జిల్లాలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ సీనియర్ నేతగా ఉన్న కొణతాల రామకృష్ణ వైసీపీకి దూరం జరుగుతన్నట్లు స్పష్టం చేశారు. పార్టీ రాజకీయ వ్యవహారల కమిటీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధినేతకు ఫ్యాక్స్ ద్వారా లేఖను పంపారు. పెందుర్తి నియెజకవర్గ కన్వీనర్ గండి బాబ్జిని పదవి నుంచి తొలగించటంతో మనస్తాపం చెందిన కొణతాల పార్టీని వీడుతున్నట్లు తెలుస్తోంది. ఇక పార్టీలో క్రియాశీలకంగా కొనసాగటంపై పూర్తి వివరాలు త్వరలోనే తెలియాల్సి ఉంది.

వైసీపీకి విశాఖ జిల్లాలో పట్టు వచ్చేలా చేసిన నేతల్లో కొణతాల ఒకరు. పార్టీకి సహాయ సహకారాలు అందిస్తూ.. కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. అయితే ఆయనకు అంతగా ప్రాధాన్యం లేకపోవటంతో మనస్తాపంకు గురై బయటకు వెళ్ళిపోయినట్లు తెలుస్తోంది. ఈ సందర్బంగా జగన్ వైఖరిని విమర్శిస్తూ ఘాటు వ్యాఖ్యలతో కొణతాల లేఖ రాసిన విషయం తెలిసిందే. లేఖలో ‘నీ ఇంటి ముందు బానిసగా నేను ఉండలేను అందుకే పార్టీ వీడుతున్నా అని తెలిపారు. అంతేకాకుండా ఎన్నోసార్లు అవమానించినా భరించాను, ఆత్మగౌరవం చంపుకుని పార్టీకోసం పనిచేశాను కాని సరైన గుర్తింపు రాకపోవటం బాధకరం అని ఆవేదన వ్యక్తం చేశారు.

జగన్ అనుసరిస్తున్నవైఖరి నచ్చకపోవటం వల్లే కొణతాల పార్టీని వీడుతున్నారు అని తెలుస్తోంది. గతంలో టీడీపీ సీనియర్ నేత దాడి వీరభద్రారావు వైసీపీలో చేరిన సందర్బంలో కొణతాల తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే ఆయన వాదనను .పక్కనబెడుతూ జగన్ దాడిని చేర్చుకున్నారు. ఇలా పలు సందర్బాల్లో రామకృష్ణకు వ్యతిరేకంగా వ్యవహరించటంతో ఈ వైఖరి నచ్చక, పార్టీలో ఇమడలేకపోతున్నట్లు సమాచారం. దీనిపై వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : konathala ramakrishna  ysr congress  andhrapradesh  latest news  

Other Articles