Former central minister jaipal reddy praises chandrababu naidu and controversial comments on kcr

jaipal reddy, jaipal reddy news, jaipal reddy comments, jaipal reddy press meet, jaipal reddy chandrababu, jaipal reddy kcr, chandrababu naidu news, kcr news

former central minister jaipal reddy praises chandrababu naidu and controversial comments on kcr

చంద్రబాబు ‘భేష్’.. కేసీఆర్ ‘బేకార్’?

Posted: 10/27/2014 09:15 PM IST
Former central minister jaipal reddy praises chandrababu naidu and controversial comments on kcr

విభజన తరువాత ఆంధ్ర - తెలంగాణ రాష్ట్రాలకు సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన బాబు, కేసీఆర్ లలో పరిపాలనా విభాగంలో చంద్రబాబే ముందున్నారని ఆయనను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. రాజకీయరంగంలో 30 సంవత్సరాలవరకు అనుభవమున్న బాబు ఎంతో తెలివితేటలకు ఉపయోగించి ఆంధ్రరాష్ట్రానికి మేలు చేస్తున్నారని.. కానీ కేసీఆర్ మాత్రం అటువంటి నిర్ణయాలేమీ తీసుకోకుండా తన రాష్ట్రాన్ని చీకటిరాజ్యంగా మార్చుకున్నారని ఎంతోమంది నాయకులు తమతమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఈ విధంగా పేర్కొంటున్నది తమతమ పార్టీలకు చెందిన నాయకులు కాదు.. ఇతర పార్టీలకు చెందిన నాయకులు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తమ మనసులోని మాటలను బయటపెడుతున్నారు. గతంలో చంద్రబాబు కంటే కేసీఆరే మేలంటూ వ్యాఖ్యలు చేసిన సందర్భాలూ చాలావరకు వున్నాయి.

ఇదిలావుండగా.. కేంద్రమాజీమంత్రి జైపాల్ రెడ్డి తనదైన రీతిలో ఈ ఇద్దరు సీఎంల మీద తన అభిప్రాయాన్ని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఆలస్యంగా పదవి చేపట్టినా.. తన సామర్థ్యంతో ఆకట్టుకునేలా పనిచేస్తున్నారని ప్రశంసించారు. అలాగే బాబుకంటే ముందే సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన కేసీఆర్.. అధికారగర్వంతో ఇంతవరకు ఏపని సరిగ్గా చేయలేదని మండిపడ్డారు. ముందుగా పదవి చేపట్టినా అతను ఎందుకు విద్యుత్ ను కొనుగోలు చేయలేదని నిలదీశారు. అదే బాబు పదవి చేపట్టగానే ముందుచూపుతో విద్యుత్ ను కొనుగోలు రాష్ట్రంలో విద్యుత్ సమస్య లేకుండా చేసుకున్నారని ఆయన కితాబిచ్చారు. నిజానికి విభజన బిల్లులో తెలంగాణాకే ఎక్కువ విద్యుత్ కేటాయించినా.. కేసీఆర్ రాష్ట్రంలో విద్యుత్ సమస్య లేకుండా చేయలేకపోయారని తెలిపారు. ‘‘పదవులు వుంటాయి, పోతాయి.. కానీ మనం చేసే పనులే శాశ్వతంగా నిలిచిపోతాయి. కేసీఆర్ ఈ సూత్రాన్ని మరిచినట్టున్నారు’’ అంటూ ఆయన పేర్కొన్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jaipal reddy  chandrababu naidu  kcr  andhra pradesh state  telangana state  

Other Articles