South africa football captain senzo meyiwa shot dead

south africa football captain Senzo Meyiwa, south africa football captain Senzo Meyiwa murder, Senzo Meyiwa death, Senzo Meyiwa murder, Senzo Meyiwa shot dead, Senzo Meyiwa latest news, south africa goal keeper Senzo Meyiwa shot dead

south africa football captain Senzo Meyiwa shot dead

ప్రేయసికోసం దారుణహత్యకు గురైన ఫుట్ బాల్ కెప్టెన్!

Posted: 10/27/2014 08:10 PM IST
South africa football captain senzo meyiwa shot dead

ఈమధ్యకాలంలో అగంతకుల దాడులు చాలా ఎక్కువగా మితిమీరిపోతున్నాయి. కేవలం తమ ఆకలిని తీర్చుకోవడం కోసం ఇతరుల ప్రాణాలను బలితీసుకుంటున్నారు. ఇక మేటర్ లోకి వస్తే.. దక్షిణాఫ్రికా ఫుట్ బాల్ కెప్టెన్ సెంజో మెయివా అగంతకుల దాడుల్లో దారుణ హత్యకు గురయ్యాడని తెలిసింది. తన ప్రియురాలి కెల్లీ ఖుమా నివాసంలోకి ఇద్దరు దుండగులు నేరుగా దూరి విచక్షణారహితంగా కాల్పులు జరిపారని.. ఆ సమయంలో తన ప్రేయసిని రక్షించుకోవడానికి అడ్డుపడిన సెంజోను దుండగులు దారుణంగా కాల్చి చంపారని పోలీసులు తెలిపారు. ఈవిధంగా దాడి చేసిన అనంతరం ఇంటి బయట కాపలాకాస్తున్న వ్యక్తితో కలిసి కాల్పులు జరిపిన వ్యక్తి పరారయ్యాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

అయితే ఈ ఘాతుకం అంతా కేవలం సెల్ ఫోన్ కోసం జరిగిందని స్థానిక మీడియా తన కథనంలో వెల్లడించింది. దాడి చేయడానికి ముందు ఇంట్లోకి చొరబడిన అగంతకులు సెంజోను మొబైల్ ఫోన్ ఇవ్వమని డిమాండ్ చేశారని.. ఆ సమయంలోనే అతని ప్రియురాలు అక్కడ ప్రత్యక్ష్యం కావడంతో తమను అటాక్ చేస్తుందేమోనన్న భయంతో వారు కాల్పులు జరిపారని.. ఆ సమయంలో ఆమెను కాపాడబోయి సెంజో దారుణహత్యకు గురయ్యాడని స్థానిక మీడియా కథాంశం! కాల్పులు జరిపిన అనంతరం పారిపోగా.. తీవ్రంగా గాయపడిన సెంజోను ఆస్పత్రికి తరలిస్తుండగానే తుదిశ్వాస విడిచాడని తెలిపారు.

ఈవిధంగా దాడికి పాల్పడిన నిందితులను త్వరలోనే పట్టుకుంటామని దక్షిణాఫ్రికా పోలీస్ సర్వీసెస్ ఓ ట్విటర్ ల వార్తను పోస్ట్ చేశారు. దుండుగుల ఆచూకీ తెలిపిన వారికి రూ.8.50 లక్షల భారీ నజరానాను కూడా ప్రకటించినట్టు ఓ వెబ్ సైట తెలిపింది. ది ఓర్లాండో పైరేట్స్ జట్టుకు కెప్టెన్ గా, గోల్ కీపర్ గా వ్యవహరించిన సెంజో మెయివా మరణంపై జట్టు సంతాపం తెలిపింది. అతను నెంబర్ వన్ గోల్ కీపరని పేర్కొన్నారు కూడా! ఇటువంటి గొప్ప ఆటగాడు ఈవిధమైన దారుణ హత్యకు గురవుతాడని తాము ఏనాడూ ఊహించలేదని ఆటగాళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలావుండగా.. మరో మీడియాకథనం ప్రకారం సెయింట్ జోసెఫ్ తన నివాసంలోనే వున్నాడని.. ఆ సమయంలో అతనితోపాటు ఏడుగురు వ్యక్తులు కూడా వున్నారని తెలుపుతోంది. అయితే అప్పుడు వారిమధ్య వాగ్వివాదం జరిగిందని.. అనంతరం అక్కడినుంచి వెళ్లిపోయిన కొంతమందిలో తిరిగి వచ్చి అతనిపై కాల్పులు జరిపినట్లు అక్కడి పోలీసులు వెల్లడించారని తెలిపింది. కథనం ఏదైతేనేం.. ఒక జట్టులో వుండే కీలక ఆటగాడు ఇలా దారుణంగా మరణించడంతో ఆ ప్రాంతంలో తీవ్ర విషాదం నెలకొంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Senzo Meyiwa  south africa football team  football goal keeper  telugu news  

Other Articles