Narendra modi siachen glacier and srinagar visit on diwali

narendra modi diwali celebrations, narendra modi on border, narendra modi on sicahin galcier, narendra modi diwali at srinagar, diwali celebrations in india, diwali celebrations in andhrapradesh, diwali celebratiosn at indian border

narendra modi siachen glacier and srinagar visit on diwali : prime minister of india narendra modi given a warm welcome by indian army at narendra modi siachen glacier he celebrated diwali here with soldiers and also celebrated diwali evening with srinagar people

పండగ వేళ పాక్ కు సవాళ్లు

Posted: 10/23/2014 04:39 PM IST
Narendra modi siachen glacier and srinagar visit on diwali

ప్రధానుల జాబితాలో గత సాంప్రదాయలకు భిన్నంగా నరేంద్రమోడి వ్యవహరిస్తున్నారు. ప్రధానిగా నరేంద్రమోడి తొలి దీపావళి పండగను సైనికులతో జరుపుకున్నారు. అటు వరదలతో తీవ్రంగా నష్టపోయిన ప్రజల కళ్ళలో వెలుగులు నిండాలని కోరుతూ.., శ్రీనగర్ లో మోడి పర్యటించి అక్కడ ప్రజలతో దీపావళి రోజున సాయంత్రం గడిపారు. సైనికులకు కొత్త ఉత్సాహాన్ని ఇవ్వటంతో పాటు.., బాధలో ఉన్న ప్రజలకు తాను ఉన్నాను అని భరోసా ఇచ్చారు. నేతల జీవితం అంటే ప్రజలకే అంకితం అని నిరూపించారు.

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఈ పర్వత శిఖరంపై కనీసం గాలి కూడా సరిగా ఆడదు. అలాంటి పర్వతంపై మన సైనికులు దేశానికి రక్షణగా పహారా కాస్తున్నారు. అలాంటి దేశ సేవకులను కలిసేందుకు గురువారం ఉదయం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయల్దేరిన నరేంద్రమోడి, ముందుగా సియాచిన్ చేరుకున్నారు. జవాన్లను కలిసే ముందుగా పర్వత ప్రాంతాన్నంతా విహంగ వీక్షణం చేశారు. సరిహద్దులో జవాన్లు ఏ పరిస్థితులను ఎదుర్కుంటూ దేశానికి రక్షణ కల్పిస్తున్నారో తెలుసుకున్నారు.  

ఆ తర్వాత సైనికులకు కలిసి పండగ శుభాకాంక్షలు తెలిపారు. కాసేపు జవాన్లతో ముచ్చటించారు. దేశానికి సేవ చేసే సైనికులకే తన తొలి ప్రాధాన్యం అని చెప్పారు. సరిహద్దులో వీరు రక్షణగా ఉన్నారు కాబట్టే.. దేశంలో ప్రజలంతా సంతోషంగా పండగలు చేసుకుంటున్నారు అని ప్రశంసించారు. అందువల్లే తాను సైనికులతో పండగ చేసుకునేందుకు వచ్చానని చెప్పారు. సరిహద్దులో ఉన్న వాస్తవ పరిస్థితులను తెలుసుకున్నారు. పాక్ దాడులు, కవ్వింపు చర్యలపై ప్రధానికి జవాన్లు వివరించారు. ప్రత్యర్ధి ఆకస్మికంగా దాడి చేసినా ధీటుగా తిప్పికొట్టేందుకు మనవద్ద ఉన్న సామర్ధ్యాలను మోడికి వివరించారు. ప్రభుత్వం ఎప్పడూ సైనికులకు అండగా ఉంటుందని చెప్పి భరోసా ఇచ్చారు.

మధ్యాహ్నం తర్వాత శ్రీనగర్ చేరుకున్న ప్రధాని.., స్థానిక ప్రజలతో దీపావళి వేడుకలు జరుపుకున్నారు. వరదలతో అతలాకుతలం అయిపోయిన ప్రజల జీవితాలకు తాను అండగా ఉంటానని మోడి స్వయంగా వచ్చి హామి ఇచ్చారు. మోడి పర్యటన రాజకీయ ప్రయోజనాల కోసం అని కొంతమంది విమర్శిస్తున్నారు. ఇది నిజం కావచ్చు.. కాకపోవచ్చు. కాని ఈ పర్యటనతో పాక్ కుట్రలకు మోడి ప్రతి సవాల్ విసిరారు అని చెప్పవచ్చు. కయ్యానికి కాలు దువ్వుతూ నిత్యం కాల్పులకు తెగబడుతున్న పాక్ కు ధీటుగా సమాధానం చెప్పగలము అని స్వయంగా సరిహద్దులో పర్యటించి మోడి సంకేతాలు పంపారు.

అటు కాశ్మీర్ లో చొరబాట్లు.., అంతర్గత వేర్పాటువాదంకు వ్యతిరేకంగా పర్యటన ద్వారా ప్రజలకు కేంద్రం ఉంది అనే భరోసా కల్పించారు. కాశ్మీర్ లో ఇంచు భూభాగం కూడా వదులుకోము అని పాక్ నేతలు ప్రకటిస్తున్న నేపథ్యంలో కాశ్మీర్ గడ్డపై పర్యటించి ఇది భారత్ సొత్తు అని స్పష్టం చేశారు. కాశ్మీర్ అంటే భారత్ లో భాగం అనీ.. ఇది దేశ ఆస్తి అని నరేంద్రమోడి పర్యటన ద్వారా పాక్ నోటి దురుసు నేతలకు సవాల్ విసిరారు. పర్యటన రోజునే పాక్ ఆర్మీ కాల్పులు జరిపి దుష్టబుద్ది చాటినా పర్యటన ఆపకుండా విజయవంతంగా పూర్తి చేసి సత్తా చాటారు.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : diwali  siachin  narendra modi  srinagar  

Other Articles