Hijras alias transgenders awarenness programme in traffic signal about wearing seat belt

hijras attitude, hijras money forcing, hijras latest news, hijras rights, hijras in trains and railway stations, traffic rules and guidelines, hijras on seatbelt, latest news updates

hijras alias transgenders awarenness programme in traffic signal about wearing seat belt : generally we think hijras only for asking money and forcing men to give money but in a crazy incident hizras participated in awarenss programme to wear seat belt on a traffic signal become popular

ట్రాఫిక్ పాఠాలు నేర్పుతున్న హిజ్రాలు

Posted: 10/23/2014 03:05 PM IST
Hijras alias transgenders awarenness programme in traffic signal about wearing seat belt

హిజ్రాలంటే మనకు గుర్తుకు వచ్చేది వారి వింత చేష్టలే. రోడ్లు, బస్టాండ్ లు, రైల్వేస్టేషన్లలో తిరుగుతూ... కన్పించిన వారందర్నీ డబ్బులు అడుగుతూ... ఇబ్బందికరమైన మాటలతో నానా రచ్చ చేస్తారు. వీరిని చూసి పారిపోయే వారు కూడా ఉన్నారు. అయితే అసలైన హిజ్రాలు డబ్బుల కోసం బెదిరించరు, ఇబ్బంది పెట్టరు. ఇస్తే తీసుకుంటారు లేవు అంటే సరే అని వెళ్ళిపోతారు. కాని ఇప్పుడున్నవారిలో చాలామంది డబ్బుల కోసం హిజ్రాలుగా మారినవారే ఉన్నారు. అందువల్లే వర్గానికి చెడ్డపేరు వచ్చింది.

అయితే ఇప్పుడు మనం చూస్తున్న హిజ్రాలు మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా సమాజసేవకోసం ఉన్నారు. ప్రజలకు చైతన్యం కల్గించేందుకు వినూత్నంగా ఓ కార్యక్రమం చేపట్టారు. ప్రస్తుతం ఇది తెగ పాపులర్ అయింది. కార్లలో తిరుగుతు సీట్ బెల్ట్ పెట్టుకోని వారి కోసం ప్రత్యేక అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఇందుకోసం తమ వేషాధారణ పూర్తిగా మార్చేసి.. చక్కటి కట్టు, బొట్టుతో అంతా ఎయిర్ హోస్టెస్ ల మాదిరిగా తయారయ్యారు. రో్డ్డుపై రెడ్ సిగ్నల్ పడగానే చకచకా వాహనాల మద్యలోకి చేరిపోయారు. రోడ్డుపై ఓ హిజ్రా నిలుచుని మైక్ లో చెప్తుండగా మిగతా వారంతా ఆమె మాటలకు అనుగుణంగా హావభావాలు పలికించారు.

మీరు సీట్ బెల్ట్ పెట్టుకోవటానికి ఎందుకు బద్దకిస్తున్నారు? ప్రమాదం జరిగితే మీ అందమైన ముఖం పాడయిపోతుంది. మీ గర్ల్ ఫ్రెండ్ ను మెప్పించలేరు. అమ్మాయిలూ.. మీ బాయ్ ఫ్రెండ్స్ బెల్టు పెట్టుకుంటేనే వారితో ఉండండి లేకపోతే ఇద్దరి ప్రాణాలకు ముప్పు తప్పదు అంటూ మైక్ లో హిజ్రా చెప్తంటే.. దీనికి అనుగుణంగా మిగతా హిజ్రాల నటన చూడటానికి వెరైటీగా కన్పించినా హిజ్రాలు ఇలా కూడా చేస్తారా అని అంతా ఆశ్చర్యపోయారు. మీరూ ఈ వీడియో చూడండి అర్ధం అవుతుంది.

 

 

 

కార్తిక్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : hijras  traffic rules  seat belt  latest news  

Other Articles