Prime minister narendra modi to visit kashmir and celebrate diwali with flood victims

Narendra Modi, Diwali, Kashmir, Assembly Elections, floods, victims

prime minister narendra modi to visit kashmir and celebrate diwali with flood victims

జమ్మూకాశ్మీర్ లో దీపావళి చేసుకోనున్న ప్రధాని మోడీ..

Posted: 10/21/2014 04:37 PM IST
Prime minister narendra modi to visit kashmir and celebrate diwali with flood victims

ప్రధాని నరేంద్ర మోదీ దీపావళి పర్వదినాన్ని జమ్మూ కాశ్మీర్ లో జరుపుకోవాలని నిర్ణయించారు. వరద బాధితులతో కలిసి ఆయన పండగ చేసుకోనున్నారు. గత నెలలో సంభవించిన వరదల కారణంగా జమ్మూకాశ్మీర్ అతలాకుతలమైంది. బాధితులకు అండగా ఉండేందుకు ప్రధాని మోదీ దీపావళి పండుగను కాశ్మీర్ లో జరుపుకోవాలని నిర్ణయించారు. బాధితుల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు ప్రధాని తీసుకున్న నిర్ణయం దోహదపడుతుందని భావిస్తున్నారు. ప్రధాని నిర్ణయంపై కాశ్మీర్ వరద బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అయితే త్వరలో జమ్మూకాశ్మీర్ శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి ప్రజల మనస్సులు చూరగోనేందుకు ప్రధాని మోడీ అక్కడికి వెళ్లనున్నట్లు కూడా విమర్శలు వినబడుతున్నాయి. మహారాష్ట్ర, హర్యానాలతో పాటే జమ్మూకాశ్మీర్ అసెంబ్లీలకు ఎన్నికలు జరగాల్సి వున్నా వరదల కారణంగా వాటిని తాత్కలికంగా వాయిదా వేశారు. ఇప్పుడిప్పడే సాధారణ పరిస్థితులు అలుముకుంటున్న జమ్మూకాశ్మీర్ లో నవంబర్ లేదా డిసెంబర్ మాసంలో ఎన్నికలను నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. అక్కడదీంతో త్వరలో ఎన్నికలు జరగనున్న కాశ్మీర్ లో అధికారాన్ని కైవసం చేసుకునే పనిలో భాగంగానే మోడీ పావులు కదుపుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి  మొత్తం 87 స్థానాలున్న రాష్ట్ర అసెంబ్లీలో బీజేపి గత ఎన్నికలలో 11 స్థానాలను కైవసం చేసుకుంది.

కాశ్మీర్ లోనూ ప్రస్తుతం కాంగ్రెస్, దాని మిత్రపక్షమైన నేషనల్ కాన్ఫరెన్స్ అధికారంలో వున్నాయి. రెండు పార్టీలు చెరో రెండున్నర ఏళ్లపాటు ముఖ్యమంత్రి పదవిని పంచుకుని అధికారాన్ని పంచుకున్నయి. ఇక్కడ కూడా తొలిసారిగా అన్ని స్థానాలకు పోటీ చేసి హర్యానా తరహాలో అధికారంలోకి రావాలని మోడీ ఆశిస్తున్నారు. మరోవైపు కాశ్మీర్ లో ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించి, ఆపై అధికారాన్ని చేజిక్కించుకోవడంతో పాకిస్థాన్ సహా దానికి మద్దతునిచ్చే దేశాలన్నింటికీ జవాడునివ్వాలని ప్రఃధాని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే పవిత్ర దీపావళి రోజున వారి వద్దకు వెళ్లి, వారితో గడపాలని ప్రధాని నిర్ణయించుకున్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Narendra Modi  Diwali  Kashmir  Assembly Elections  floods  victims  

Other Articles