Bhuma akhila priya all set to elect unanimously as congress is not in the race

allagadda, bhuma akhila priya, unanimous election, congress party, by-elections, raghuveera reddy, pcc chief

bhuma akhila priya all set to elect unanimously, as congress is not in the race

ఆళ్లగడ్డలో పోటీకి కాంగ్రెస్ దూరం, ప్రియ ఎన్నిక లాంఛనం..

Posted: 10/21/2014 05:47 PM IST
Bhuma akhila priya all set to elect unanimously as congress is not in the race

ప్రధాన పార్టీలైన తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు అభ్యర్థులను నిలబెట్టకూడదని నిర్ణయించడంతో ఇక ఆళ్లగడ్డ ఉప ఎన్నిక లాంఛనప్రాయంగా మిగిలింది. కర్నూలు జిల్లా కాంగ్రెస్ నాయకుల తీర్మాణం మేరకు.. ఆళ్లగడ్డ ఉప ఎన్నికలలో తమ అభ్యర్థిని నిలబెట్టడం లేదని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తెలిపారు. అంతకుముందే తెలుగుదేశం పార్టీ కూడా తమ అభ్యర్థిని అక్కడ పోటీ చేయించడం లేదని ప్రకటించింది. దీంతో ఆళ్లగడ్డ ఉప ఎన్నికలలో శోభానాగిరెడ్డి తనయ అఖిలప్రియ ఎన్నిక లాంఛనమే కానుంది.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు శోభా నాగిరెడ్డి సార్వత్రిక ఎన్నికల సమయంలో ఏప్రిల్ 24న రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈవీఎంలలో చేర్చిన శాభానాగిరెడ్డి పేరును తొలగించడం సాధ్యం కాకపోవడంతో మరణాతరం కూడా శోభానాగిరెడ్డి గెలిచినట్లు ప్రకటించారు. హైకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఆళ్లగడ్డకు నవంబరు 8న ఉప ఎన్నిక నిర్వహిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆళ్లగడ్డ అసెంబ్లీ నియాజకవర్గానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శోభా నాగిరెడ్డి కుమార్తె భూమా అఖిలప్రియ నామినేషన్ దాఖలు చేశారు.

శాసనసభ్యులు మృతి చెంది.. పోటీలో వారి కుటుంబసభ్యులే నిలబడితే ఇతర పార్టీలు పోటీ చేయకూడదన్న సాంప్రదాయాన్ని అన్ని పార్టీలు కొనసాగిస్తున్నాయి. ఇటీవల జరిగిన నందిగామ ఉప ఎన్నికలో టీడీపీ కూడా సాంప్రదాయాన్ని కొనసాగించింది. ఆళ్లగడ్డ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైన వెంటనే.. అందరూ అక్కడ పోటీ ఉండదని, ఏకగ్రీవం తప్పదని భావించారు. అనుకున్నట్లు గానే.. భూమా అఖిలప్రియ ఏకగ్రీంగా ఎన్నిక కావడం దాదాపు ఖాయమైపోయింది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles