Jayalalitha says her life is like swimming in ignis river

jayalalitha case, jayalalitha bail, jayalalitha latest updates, jayalalitha arrest, aidmk party updates, jayalalitha comments, karunanidhi on jayalalitha, subramhanya swamy on jayalalitha, tamilnadu news, latest updates, rivers, ignis river

jayalalitha says her life is like swimming in ignis river : tamilnadu former chief minister jayalalitha says her life is like swimming in ignis river she faced so many problems and issues in her life hopes that will comeout from this case also

నిప్పుల నదిని ఈదుతున్న భారతీయ మహిళ

Posted: 10/20/2014 10:11 AM IST
Jayalalitha says her life is like swimming in ignis river

తన ప్రజా జీవితంపై తమిళనాడు మాజిముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత స్పందించారు. జైలు నుంచి వచ్చిన తర్వాత తొలిసారి ప్రజలను ఉద్దేశించి ప్రకటన విడుదల చేసిన జయ.., తనపై ప్రజలు చూపించిన ఆదరాభిమానాలకు సంతోషిస్తున్నట్లు చెప్పారు. ఇక తన ప్రజా జీవితంపై ప్రకటనలో ఆసక్తికర కామెంట్లు చేశారు. ‘నా ప్రజా జీవితం అగ్ని సముద్రంలో ఈతలాంటిది. ఎన్నో సవాళ్లను అధిగమించాను. ఎన్ని ఇబ్బందులు వచ్చినా అదరను, బెదరను.. తాజా కేసు నుంచి కూడా నిర్దోషిగా బయటకు వస్తాను’ అని లేఖ విడుదల చేశారు.

‘సొంత సోదరిగా చూపుతున్న ప్రేమాభిమానాలు, తిరుగులేని ప్రజా మద్దతు ఉన్నంతవరకు ఎన్ని విపత్కర పరిస్థితులు వచ్చినా ఎదుర్కుంటాను’ అని జయ తెలిపారు. ప్రజల మద్దతు, ఆశీస్సులు ఉన్నంత వరకు తనకు ఏ ఇబ్బంది రాదు అని స్పష్టం చేశారు. ఇక తాను జైలుకు వెళ్ళిన వార్త తట్టుకోలేక చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకు రూ3లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు, ఆత్మహత్యాయత్నం చేసి గాయపడ్డవారికి రూ. 50వేలు ఆర్ధికసాయం అందిస్తామని ప్రకటించారు.

అక్రమాస్తుల కేసులో అరెస్టయిన జయలలిత.., రెండ్రోజుల క్రితం సుప్రీం కోర్టు బెయిల్ ఇవ్వటంతో జైలు నుంచి విడుదల అయ్యారు. జయతో పాటు మరో ఇద్దరు దోషులకు కూడా కోర్టు బెయిల్ ఇచ్చింది. జయకు బెయిల్ ఇవ్వటంపై కరుణానిధి జాగ్రత్తగా స్పందించారు. జయ అరెస్టు కావటం పట్ల సంతోషించలేదు.. విడుదల కావటం పట్ల విచారం లేదు. అని కరుణానిధి కామెంట్ చేశారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jayalalitha  ignis river  latest updates  cases  

Other Articles