Woman died by husband assult for getting missed call at earlymorning

mobile phones, murders with mobile, husband and wife relationship, mobile phone problems, medak news, suspecting character, husband character, wife character, family relationships, latest updates, funny deaths, missed calls tracking, mobile number tracking

wife died in medchal by husband assult for getting missed call at earlymorning : in medchal mandal gundrapochampally narsimha assulted on his wife kanakavva with suspecting her character during that time at early morning 3.30 kanakavva got a missed to her mobile than he feels toomuch angry beats wife seviourly and died in hospital

అనుమానం పెనుభూతం.. మొబైల్ మర్డర్

Posted: 10/20/2014 09:51 AM IST
Woman died by husband assult for getting missed call at earlymorning

అనుమానం ఓ మహిళ పాలిట పెనుభూతమయింది. సెల్ కు వచ్చిన మిస్ కాల్ నిండు ప్రాణంను బలితీసుకుంది. రంగారెడ్డి జిల్లా మేడ్చల్ మండలంలో ఈ సంఘటన జరిగింది. పూర్తి వివరాలు చూస్తే.., మెదక్ జిల్లా దుబ్బాక మండలం గుండ్ల పోచంపల్లికి చెందిన కనకవ్వ అనే మహిళకు ఆకారం గ్రామానికి చెందిన నర్సింహ్మతో తొమ్మిదేళ్ల క్రితం వివాహం అయింది. వీరికి ఎనమిదేళ్ల కూతురు ఉంది. ఈ మద్య కుటుంబ తగాదాలు రావటంతో నర్సింహ్మ భార్యతో కలిసి మేడ్చల్ మండలం గుండ్లపోచంపల్లికి వచ్చి నివసిస్తున్నాడు. భర్త స్థానికంగా డ్రైవర్ కాగా., కనకవ్వ సీడ్స్ కంపనీలో పనికి వెళ్తుంది.

అయితే భార్యపై నర్సింహ్మకు అనుమానం ఉండేది. రాత్రి తాగి వచ్చి నిత్యం వేధించేవాడు. ఈ క్రమంలోనే గొడవ జరుగుతుండగా.., తెల్లవారుజామున 3.30కి కనకవ్వ సెల్ కు మిస్ కాల్ వచ్చింది. దీంతో నర్సింహ్మ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఇంత తెల్లవారుజామున ఎవరు ఫోన్ చేశారు.. ఎక్కడినుంచి వచ్చింది అంటూ భార్యను చితకబాదాడు. ఈ దెబ్బలకు కనకవ్వ స్పృహ కోల్పోయింది. వెంటనే స్థానికులు, బంధువులు బషీరాబాద్ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలిసులు... నర్సింహ్మను అదుపులోకి తీసుకున్నారు. కనకవ్వ మృతికి కారణం అయిన మిస్ట్ కాల్ ఎవరు చేశారు.. ఎందుకు చేశారు అనే విషయంపై ధర్యాప్తు చేస్తున్నారు. క్షణికావేశంలో చేసిన తప్పుకు నిండు ప్రాణం బలికాగా.. ఎనమిదేళ్ల నవ్వ తల్లిలేని బిడ్డగా మిగిలింది. అటు తండ్రి కూడ అరెస్టు కావటంతో అమ్మాయి దిక్కుతోచని స్థితిలో ఉంది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mobile  missedcalls  murder  latest  

Other Articles