Hudhud ready to slam vishakha

Hudhud ready to slam Odisha, Andhra PradeshCyclone Hudhud, Visakhapatnam, Bay of Bengal, Cyclone, Andhra Pradesh, odisha, army, ndrf, naveen patnaik, chandrababu

సముద్రడు ఉగ్రరూపం.. భయాందోళనలో కోస్తాతీరం

Posted: 10/12/2014 10:06 AM IST
Hudhud ready to slam vishakha

సముద్రుడు ఉగ్రరూపం దాల్చాడు. హుద్‌హుద్ తుపాను రూపంలో తూర్పుకోస్తా తీరంలో ప్రళయాన్ని సృష్టించేందుకు దూసుకొస్తున్నాడు. ప్రచండ వేగంతో ఆంధ్రప్రదేశ్ ఉత్తర కోస్తా జిల్లాల దిశగా కదులుతోంది. దాదాపు తొమ్మిది కిలోమీటర్ల మందాన, 450 కిలోమీటర్ల వ్యాసంతో బంగాళాఖాతంలో సుడులు తిరుగుతున్న ఈ తుపాను ఏకంగా విశాఖపట్నం తీరం దగ్గరే 50 కిలోమీటర్ల వద్ద మాటేసింది. వాయువ్య దిశగా కదులుతున్న ఈ తుపాను ఇవాళ మధ్యాహ్నానికి ఆంధ్ర-ఒడిశాల మధ్య తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు.

ఒడిశా వైపు వెళ్లకుండా నేరుగా విశాఖలోని నగరం వద్దే తీరం దాటే అవకాశం ఉంది. తుపాను ప్రభావంతో బంగాళాఖాతం మహోగ్ర రూపం దాల్చింది. సముద్రం 20 మీటర్లు ముందుకు వచ్చింది. ఉత్తర కోస్తా అంతటా సముద్ర కెరటాలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. 60 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తున్నాయి. అది 195 కిలోమీటర్ల వరకు పెరుగుతుందని అంచనా. అత్యంత ప్రమాదకరంగా పరిణమించిన హుద్‌హుద్ తుపాను తీరాన్ని దాటుతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్, ఒడిశాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది.

ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తర కోస్తా, గోదావరి జిల్లాలు, దక్షిణ ఒడిశాలోని గంజాం, గజపతి, కలహండి, పుల్బని జిల్లాల్లో వర్షాల ప్రభావం తీవ్రంగా ఉండబోతోంది. తుపానుపై కేంద్ర, ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ప్రధాని ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో వీడియో కాన్ఫరెన్సులు నిర్వహించి, సహాయ ఏర్పాట్లను సమీక్షించారు. ఉత్తర కోస్తా, ఉభయ గోదావరి... అయిదు జిల్లాల్లో మంత్రులు, అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. లోతట్టు ప్రాంతాల వారిని సహాయ శిబిరాలకు తరలి రావాలని నచ్చజెబుతున్నారు. వచ్చిన వారికి శనివారం రాత్రి భోజనాలు ఏర్పాట్లు చేశారు.

పెను తుపాను హుదూద్ ను రంగంలోకి భారత త్రివిధ దళాలు దిగాయియి. తుఫాను ప్రభావిత ప్రాంతాలలోని భాధితులకు సహాయ, పునరావాస చర్యల కోసం ఎన్డీఆర్‌ఎఫ్, ఆర్మీ, నేవీ బలగాలు రంగంలోకి దిగాయి. శ్రీకాకుళం జిల్లాకు రెండు, విజయనగరానికి ఒకటి, విశాఖకు ఆరు, బెటాలియన్ల ఎన్డీఆర్ఎఫ్ బలగాలను పంపించారు. ఇప్పటికే నౌకాదళం అయిదు హెలికాప్టర్లు, 60 మంది గజ ఈతగాళ్లతో కూడిన 15 బృందాలను సిద్ధం చేసింది. ఆర్మీ 225 మంది సుక్షితులైన జవాన్ల బృందాలను విశాకకు పంపింది. భారత నావికాదళానికి చెందిన నాలుగు నౌకలను, మరో 30 గజ ఈతగాళ్ల బృందాలు, రబ్బరు బోట్లుని సిద్ధం చేశామని తూర్పు నావికాదళం పేర్కొంది.

హుదూద్ తుపాను ప్రళయ భీకరంగా విరుచుకుపడుతుందన్న సంకేతాలతో అధికారులు.. తీరప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తుపాను వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా నివారించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను అదేశించారు. అన్ని ప్రభావిత జిల్లాలలో వైద్యఆరోగ్యశాఖ అధికారులను అప్రమత్తం చేశారు. ప్రధానంగా విజయనగరం, విశాఖపట్టణం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో యుద్ధప్రాతిపదికన అవసరమైన ప్రాంతాల్లో వైద్యసేవలు అందించడానికి వీలుగా ప్రజలకు అందుబాటులో ఉండేలా ప్రత్యేక వైద్యబృందాలను సిద్ధం చేశారు. ప్రతి మండల కేంద్రంలోనూ ప్రత్యేకంగా రెండు అంబులెన్సులు అందుబాటులో ఉంచుతున్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Cyclone Hudhud  Visakhapatnam  Bay of Bengal  Cyclone  Andhra Pradesh  odisha  army  ndrf  naveen patnaik  chandrababu  

Other Articles