Horifying hudhud cyclonic terrifies barampuram

Cyclone Hudhud, Bay of Bengal, Cyclone, odisha, barampuram

Horifying hudhud cyclonic terrifies barampuram

తుఫాను ప్రభావంతో..భయం గుప్పిట్లో భరంపురం..

Posted: 10/12/2014 12:02 PM IST
Horifying hudhud cyclonic terrifies barampuram

బంగాళాఖాతంలో ఏర్పడిన 'హుదూద్' పెను తుపాను ప్రభావంతో ఒడిశాలోని బరంపురం పట్టణవాసులు భయం గుప్పిట్లోకి జారుకున్నారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు ఇవాళ  మరింత జోరందుకున్నాయి. భారీ వర్షాలకు పెనుగాలులు తోడవడంతో ప్రజల్లో భయాందోళనలు పెరుగుతున్నాయి. వర్షాలకు తోడు వేగంగా వీస్తున్న పెనుగాలులతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. బరంపురం క్రీడామైదానం ప్రహరీని ఆనుకుని ఉన్న చెట్టు కొమ్మ పెనుగాలులకు విరిగి రోడ్డుపైకి కూలింది. ప్రజలంతా ఇళ్లకే పరిమితమవ్వడంతో నగరంలోని రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. వాహన రాకపోకలు నిలిచిపోవడంతో 16, 59వ నంబరు జాతీయ రహదారులు బోసిపోయాయి. ఫైలిన్, నీలం తుపాన్లు మిగిల్చిన గాయాలను మరువక ముందే మరో పెను తుపాన్ తమ బతుకులను చిద్ధ్రం చేస్తుందని వణుకుతున్నారు. కడలి తల్లి తమప పగబట్టినట్లుగా వుందని, అందుకనే వరుస తుపాన్లు తమను నిండా ముంచుతున్నాయని వారు వాపోతున్నారు. తుఫాను ప్రభావిత ప్రాంతమైన బరంపురంలోని వివిధ చోట్ల ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో మురికివాడల వాసులు ఆశ్రయం పొందుతున్నారు. ఆయా కేంద్రాల్లో విద్యుత్తు, మరుగుదొడ్లు, మంచినీటి సౌకర్యాలు ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు.

దక్షిణ ఒడిశా ముఖద్వారం బరంపురం రైల్వే స్టేషన్ మీదుగా రోజుకు సుమారు పది వేల మంది సాధారణ ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు వెళుతుంటారు. రిజర్వేషన్ టికెట్ ప్రయాణికులు అదనం. కాగా 'హుదూద్' పెనుతుపాను నేపథ్యంలో పలు రైళ్లు రద్దవగా, మరికొన్నింటిని దారి మళ్లించడంతో ఇవాళ బరంపురం రైల్వే స్టేషన్ బోసిపోయింది. రైల్వే స్టేషన్‌లోని నియంత్రణ గదిలో ఈస్ట్‌కోస్ట్ రైల్వే ప్రత్యేక అధికారుల బృందం 24 గంటలూ పరిస్థితిని సమీక్షిస్తోంది. ప్రయాణికులకు రైళ్ల రాకపోకలు, రిజర్వేషన్ రద్దు, ఇతరత్రా వివరాలు ఫోన్ల ద్వారా అందజేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పెనుతుపాను కారణంగా కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతింటే దాన్ని ఎదుర్కొనేందుకు నియంత్రణ గదిలో ఓ శాటిలైట్ ఫోను కూడా సిద్ధంగా ఉందని రైల్వే అధికారులు తెలిపారు. మరోవైపు బస్సు రవాణా వ్యవస్థను కూడా అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు బస్సులు రద్దు సమాచారంతో వెనుదిరిగారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Cyclone Hudhud  Bay of Bengal  Cyclone  odisha  barampuram  

Other Articles