Ap cm chandrababu naidu given statement that he will developed guntur as state capital city

cm chandrababu naidu, chandrababu naidu latest news, chandrababu naidu guntur news, chandrababu naidu guntur tour, chandrababu naidu press meet, chandrababu naidu press note, ap capital city, ap capital city news

ap cm chandrababu naidu given statement that he will developed guntur as state capital city

సీమాంధ్ర ప్రజారాధానిగా గుంటూరును ప్రకటించిన చంద్రబాబు!

Posted: 10/08/2014 09:55 PM IST
Ap cm chandrababu naidu given statement that he will developed guntur as state capital city

విభజన అనంతరం మూడునెలల గడిచిన అనంతరం ఆంధ్రప్రదేశ్ రాజధానిపై పూర్తిగా క్లారిటీ ఇవ్వని చంద్రబాబు... విజయవాడ సరిహిద్దు ప్రాంతాల్లో రాజధాని నిర్మాణం వుంటుందని గతంలో పేర్కొన్న విషయం తెలిసిందే! అయితే రాజధాని నిర్మాణం ఎప్పటినుంచి, ఎక్కడి నుంచి, ఎలా చేపట్టాలి.. భూములు కేటాయింపు విషయంలో తర్జనభర్జనలో మునిగిపోయిన కమిటీ సభ్యులతో బాబు మరోసారి సుదీర్ఘ సమావేశాలు నిర్వహించారు. ఆ సమావేశంలో భాగంగా విజయవాడతోపాటు గుంటూరును కూడా రాజధానిగా మార్చాలనే ప్లాన్ లో వున్నట్లు అంతర్గత సమాచారాలు అప్పట్లో వెలువడ్డాయి. అంటే ఆంధ్ర రాజధానిగా విజయవాడ లేదా గుంటూరు కావచ్చుననే అనుమానాలు మళ్లీ తెరమీదకు వచ్చాయి. అయితే ఇప్పుడు ఆ సందేహాలు పూర్తిగా తొలగిపోయినట్లు తెలుస్తున్నాయి. తాజాగా చంద్రబాబు రాజధాని విషయంపై కొన్ని ఆసక్తికరమైన ప్రకటనలు వెలిబుచ్చారు.

బుధవారం మధ్యాహ్నం గుంటూరులో పర్యటించిన సీఎం చంద్రబాబు.. ఆ ప్రాంతాన్ని రాష్ట్ర రాజధానిగా అభివృద్ధి చేస్తామని ప్రకటింటారు. అతి త్వరలోనే గుంటూరు ప్రజారాజధానిగా అభివృద్ధి చేసి నిరూపిస్తామని ఆయన బహిరంగంగా వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇప్పుడు రాజధాని విషయంపై అధికారుల్లో మరోసారి గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయని వార్తలు వస్తున్నాయి. నిన్నమొన్నటివరకు విజయవాడ సరిహద్దుల్లో రాజధాని వుంటుందని ప్రకటించిన బాబు.. ఇప్పుడు ఇంత హఠాత్తుగా గుంటూరు అంటూ పేర్కొనడంపై కొంతమంది సందేహాల్లో మునిగిపోయారు. అయితే గుంటూరు రాష్ట్ర రాజధానిగా అభివృద్ధి చేస్తామని బాబు ప్రకటించారు గానీ... సీమాంధ్ర రాష్ట్రానికి గుంటూరే రాజధాని అంటూ ప్రకటించలేదు. అంటే.. గుంటూరు ప్రాంతం కూడా రాజధాని కాదనే అనుమానాలు ఇక్కడ వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా.. విజయవాడ - గుంటూరు చాలా దగ్గరగా వున్నాయి కాబట్టి.. రాజధాని ఎక్కడ ఏర్పడినా అంతగా తేడా లేదని కొంతమంది విశ్లేషకుల వాదన!

ఇదిలావుండగా.. ఈ గుంటూరు పర్యటన నేపథ్యంలో బాబు మరికొన్ని హామీలను ప్రజల ముందు వుంచారు. మొదట నీరు-చెట్టు, జన్మభూమి, బడి పిలుస్తోంది వంటి కార్యక్రమాలకు హాజరు అయిన ఆయన.. ఆ కార్యక్రమానికి వచ్చిన డ్వాక్రా మహిళలను ఎంతగానో ప్రశంసించారు. పట్టుదలకు మారుపేరుగా డ్వాక్రా సంఘాల సభ్యులని, వారికి వడ్డీలేని రుణాలను ఇస్తామని ఆయన చెప్పారు. డ్వాక్రా సంఘాలు కట్టిన వడ్డీని పూర్తిగా చెల్లిస్తామని ఆయన అన్నారు. మహిళలు తయారుచేసిన ఉత్పత్తుల మార్కెటింగ్ బాధ్యత కూడా తామే చూసుకుంటామని ఆయన అన్నారు. మహిళలు ఆదాయం పెరిగే మార్గాలు ఆలోచించాలని, ప్రతి మహిళా ఒక పారిశ్రామిక వేత్తగా తయారుకావాలని ఆయన అభిప్రాయపడ్డారు. వినుకొండలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఆయన... ఆ ప్రాంతాన్ని పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే రైతు రుణాల రీషెడ్యూల్ బాధ్యత పూర్తిగా తనదేనంటూ పేర్కొన్న ఆయన.. త్వరలోనే రుణాలు మాఫీ అయ్యేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chandrababu naidu  andhra pradesh state  ap capital city guntur  telugu news  

Other Articles