Pakistan army violates cease fire continuously

pakistan, army, violates, cease fire, continuously, indian army, border villagers

pakistan army violates cease fire continuously

సరిహద్దులో బరి తెగిస్తున్న పాకిస్థాన్ బలగాలు..

Posted: 10/06/2014 07:29 AM IST
Pakistan army violates cease fire continuously

కుక్క తోక వంకర అన్న నానుడి పాకిస్థాన్ విషయంలో సరిగ్గా సరిపోతోంది. కాల్పుల విరమణ ఉల్లంఘనలు చేస్తూ దాష్టికానికి పాల్పడుతోంది. వరుస కాల్పులకు తెగబడుతూ.. కాశ్మీర్ ప్రజల ప్రాణాలను హరిస్తోంది. అది చాలదన్నట్లు ఐక్యరాజ్యసమితిలొ పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీష్ చేసిన వ్యాఖ్యలు ఆయన ద్వంత నీతికి దర్పణం పడుతున్నాయి. కాశ్మీర్ లో వుంటున్న ప్రజలపై కాల్పులకు తెగబడి ప్రాణాలు తీస్తున్న విషయాన్ని పక్కన బెట్టి.. కాశ్మీర్ లో ముస్లింలు బలవంతంగా జీవిస్తున్నారని ఆయన చేసిన వ్యాఖ్యాలు అయన కుటిల రాజనీతికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.

భారత్ తో పలుమార్లు యుద్దానికి తెగబడిన పాకిస్థాన్ బలగాలు.. తొకముడుచుకుని పారిపోయాయి. అయినా బుద్దిరాని పాక్ దొంగ దెబ్బ తీయాలని చూస్తుంది. కార్గిల్ యుద్దంలో జరిగిన పరిణామాలను గుర్తు చేసుకుంటే.. పాక్ వెన్నులో వణుకు పుట్టడం ఖాయం. అయితే.. భారత ఆర్మీతో ఏ విధంగాను తలపడలేని పాకిప్థాన్.. తన చేతకాని తనాన్ని కప్పిపుచ్చుకోడానికి రాత్రిళ్లు, లేదా.. వేకువ జామున కాల్పులకు తెగబడుతోంది. భారత్ తో పెట్టుకుంటే మనజాలమని తెలసి కూడా కవ్వింపులకు కాలుదువ్వుతోంది.

ఐదు రోజుల వ్యవధిలో పాకిస్థాన్ బలగాలు పదకొండు సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించాయి. భారత్-పాక్ సరిహద్దులోని నియంత్రణ రేఖ(ఎల్‌వోసీ) వద్ద ఏకపక్ష యుద్దానికి తెరలేపుతున్నాయి. దోంగ దెబ్బలతో సరిహద్దు ప్రాంతాల ప్రజల ప్రాణాలను హరిస్తున్నాయి. పాక్ సేనల వరుస దుస్సాహసానికి భారత్ బలగాలు ధీటుగానే సమాధానం చెబుతున్నా..కవ్వింపు చర్యలు మాత్రం అపడం లేదు. శనివారం పూంఛ్ జిల్లాలోని సబ్జియాన్ ప్రాంతంలో.. ఆదివారం కాశ్మీర్‌లోని మేంధర్ సెక్టార్‌లో పాక్ సైన్యం కాల్పులకు తెగబడింది. తాజాగా జమ్మూకాశ్మీర్ లోని అర్నియా ప్రాంతంలో సరిహద్దు భద్రతా దళాల పోస్టులను టార్గెట్ గా చేసుకుని పాక్ రేంజర్లు దాడులకు పాల్పడ్డాయి. ఈ దాడుల్లో నలుగురు పౌరులు మృతి చెందగా, 26 మందికి గాయాలయ్యాయి. ఈ కాల్పలలో మోటార్లు, రోటార్లుతో పాటు పదునన వస్తువులను వినియోగించినట్లు భారత్ ఆర్మీ అధికారులు తెలిపారు.

భారత్ తో స్నేహహస్తం అందుకోడానికి తాము ఎల్లప్పుడూ ముందుంటామని ప్రపంచ దేశాల ముందు తేల్చి చెబుతున్న పాకిస్థాన్.. సరిహద్దులో మాత్రం వెన్ను పోటు పోడిచేందుకు సర్వ ప్రయత్నాలు చేస్తోంది. ప్రధాని నరేంద్రమోడీకి బహుమతులు పంపిస్తున్న నవాజ్ షరీఫ్.. భారత్ సరిహద్దు ప్రజలపై మాత్రం తన తూటాలను సంధిస్తున్నారు. పాములో పగ పెట్టుకుని.. తోకతో చుట్టరికం చేయడం అలవాటుగా మరిన పాకిస్థాన్ దేశ ప్రజల ప్రాణాలను హరిస్తూ.. సైన్యంపై నిత్యం దాడులకు పురిగొల్పుతూ.. ప్రధానికి శుభాకాంక్షలు చెప్పడం వారికే చెల్లింది. ఇకనైనా పాకిస్థాన్ నిజాయితీగా వ్యవహరించడం మంచిది.  

కాశ్మీర్లో బక్రీద్ పర్వదినాన ప్రాణాలు కోల్పయిన భారత్ మహ్మదీయ సోదరుల ఇంట చావు డప్పులు మ్రోగుతుంటే.. అది పాకిస్థాన్ ప్రజలకు , పాలకులకు, సైన్యానికి మంచిదేనా..? దయాది దేశం కాబట్టి భారత్.. సంయమనం పాటిస్తూ.. సహిస్తోంది. భారత్ సహనానికి పరీక్ష పెట్టే చర్యలు ఏ ఒక్కటీ చేయకూడదని నిమ్మకుంటోంది. భారత్ సరిహద్దు భద్రతా దళాలకు చెందిన ఇద్దరి తలలను తెగనరికి తీసుకెళ్లినా.. యుద్దం వద్దని.. అది ఇద్దరికి అనర్థదాయకమని సహించింది. ఇంకానా..? ఇక చాలు అని భారత్ బదులిస్తే.. ఎదుర్కోనడానికి పాకిస్థాన్ వద్ద ఏమీ మిగలదు. ఇది అందరికీ తెలిసిన సత్యమే.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pakistan  army  violates  cease fire  continuously  indian army  border villagers  

Other Articles