Kerala congress women leaders protests against yesudas comments on wearing women jeans

yesudas latest news, singer yesudas latest news, yesudas news, yesudas jeans controversy, kerala women congress leaders, girls wearing jeans pants, college girls wearing jeans

kerala congress women leaders protests against yesudas comments on wearing women jeans

‘‘జీన్స్ ప్యాంట్’’ కోసం గొడవ పడ్తున్న ఏసుదాస్, మహిళలు!

Posted: 10/03/2014 06:04 PM IST
Kerala congress women leaders protests against yesudas comments on wearing women jeans

భారతదేశంలో గొప్ప గాయకుడిగా పేరు సంపాదించుకున్న కె.జె.ఏసుదాస్.. కేవలం ఒక్క జీన్స్ ప్యాంట్ కోసం ఏకంగా మహిళలతోనే గొడవలకు దిగినట్లు ప్రచారం కొనసాగుతోంది. ఏసుదాస్ ఒక పేరొందిన గాయకుడు అయినప్పటికీ.. మహిళలు ఆయన్ను ఖాతరు చేయకుండా గొడవకు దిగారని వార్తలు వస్తున్నాయి. దీంతో ఇది హాట్ టాపిక్‌గా మారిపోయింది. ప్రస్తుతం ఈ విషయంలో ఏసుదాస్ కొద్దిగా సైలైంట్ అయినా.. మహిళలు మాత్రం వెనక్కి తగ్గడం లేదని, ఆయనపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారని వార్తలు జోరందుకున్నాయి. ఎప్పుడూ ఇతర విషయాల్లో జోక్యం చేసుకోని ఈయన.. ఇలా జీన్స్ ప్యాంట్ విషయంలో గొడవ పడటంతో టాక్ ఆఫ్ ది టౌన్‌గా వార్త నిలిచిపోయింది.

అసలు జరిగిన విషయం ఏమిటంటే.. గాంధీజయంతి సందర్భంగా తిరువనంతపురంలో జరిగిన ఓ కార్యక్రమం నేపథ్యంలో ప్రముఖ గాయకుడు కె.జె.ఏసుదాస్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళలు జీన్స్ ధరించడం భారతదేశ సంస్కృతి - సంప్రదాయాలకు విరుద్ధమని అనడమేకాకుండా.. మహిళలు అలా జీన్స్‌లు ధరించి ఇతరులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన అన్నారు. నిరాడంబరత్వం, మంచితనం వంటి ఎన్నో సద్గుణాలు కలిగిన భారతీయ మహిళలు జీన్స్ ధరించడం తగదని అని చెప్పిన ఆయన.. భారతీయ మహిళలు నిండుదనంతో కూడిన వస్త్రాలని ధరిస్తేనే బాగుంటుందని సలహా ఇచ్చారు. రానురాను మహిళల వస్త్రధారణ మరీ విపరీతంగా వుంటోందని, అలా వేసుకోవడం వల్లే మగాళ్ల అభిప్రాయాలు చెడుగా మారుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.

అయితే ఆయన చేసిన వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కావని, మహిళల స్వేచ్ఛను హరించినట్లేనంటూ కేరళలో కాంగ్రెస్ మహిళా నేతలు, కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్ మహిళా నేత బిందుకృష్ణ శుక్రవారం ఆయన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నగరంలో నిరసన ప్రదర్శన సైతం నిర్వహించారు. గాయకుడిగా ఏసుదాస్‌ని భారతీయులంతా గౌరవిస్తామని.. సంగీతానికి ఆయన అందించిన సేవలు ఎంతో అమోఘమైనవి అంటూ పేర్కొన్న ఆమె.. ఆ స్థాయిలో వున్న వ్యక్తి కూడా మహిళల వస్త్రధారణపై ఈవిధంగా వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని అంటున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles