Kamal hassan accepts modi challenge swachh bharat

kamal hassan, kamal hassan latest press meet, narendra modi, pm modi news, kamal hassan narendra modi, swachh bharat programme, kamal hassan swachh bharat news

kamal hassan accepts modi challenge swachh bharat

మోడీ వేసిన సవాలును స్వీకరించిన కమల్‌హాసన్!

Posted: 10/03/2014 05:14 PM IST
Kamal hassan accepts modi challenge swachh bharat

‘‘అందరూ కలిసి పనిచేస్తేనే మన దేశం చాలా త్వరగా అభివృద్ధి చెందుతుంది’’ అంటూ అందరినీ తన బాటలో నడిపే ప్రధాని నరేంద్రమోడీ.. అనుకోకుండా ఇప్పుడు సవాళ్లు విసురుతున్నారు. అయితే ఈ సవాళ్లు విసురుతున్నది తనకోసం కాదులెండి.. దేశ పారిశుద్ధ్యం కోసం! గురువారం మోడీ ప్రారంభించిన ‘‘స్వచ్ఛ్ భారత్’’ కార్యక్రమం సందర్భంగా ఆయన దేశప్రజలతోపాటు సినీ, రాజకీయరంగాల్లో వున్న ప్రముఖులకు సైతం ఇందులో పాల్గొనవలసిందిగా సవాలు విసిరారు. ఈ నేపథ్యంలోనే ఆయన తమిళ కథానాయకుడు కమల్ హాసన్ కూడా సవాలు విసిరారు. దీంతో ఇప్పుడు ఆయన రంగంలోకి దిగాల్సి వచ్చింది. తాను మోడీ విసిరిన సవాలును పూర్తిగా స్వీకరిస్తున్నట్లు స్పష్టం చేశారు.

ఈ విషయమై కమల్ చెన్నైలో మాట్లాడుతూ.. స్వచ్ఛ్ భారత్ కార్యక్రమంలో ప్రధాని తనను భాగస్వామ్యం చేసినందుకు ధన్యవాదాలను తెలుపుకున్నారు. తాను కూడా ఈ పారిశుద్ధ్యంపై గత 20 ఏళ్లుగా పనిచేస్తున్నానని తెలిపారు. తనతోపాటు అభిమానులు కూడా చాలాకాలం నుంచి సామాజిక సేవలో పాల్గొంటున్నారని ఆయన వెల్లడించారు. తాజాగా మోడీ ప్రవేశపెట్టిన ఈ స్వచ్ఛ్ భారత్ కార్యక్రమం ఎంతో బాగుందని.. ఇది ప్రజల పని ఆయన స్పష్టం చేశారు. అయితే దీనిని అనవసరంగా రాజకీయానికి వాడుకోవద్దని ఆయన ఇతర నాయకులకు పరోక్షంగా వేడుకున్నారు.

ఇదిలావుండగా.. మోడీ తనను సవాలు చేస్తే.. తాను 90 లక్షల మంది భారతీయులను సవాలు చేస్తున్నానని కమల్ అన్నారు. అందరూ ‘స్వచ్ఛ్ భారత్’లో పాలుపంచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. తన అభిమానులంతా ఇందులో భాగస్వాములు కావాలని ఆయన కోరారు. ఇటువంటి కార్యక్రమాల ద్వారానే మన దేశం మరింత అభివృద్ధి చెందుతుందని.. మోడీలాంటి నాయకుడు దేశానికి ఎంతో అవసరం అని ఆయన చెప్పకనే చెప్పారని సన్నిహిత వర్గాలు అంటున్నాయి. ఈయనతోపాటు పలు బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆసక్తి చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kamal hassan  swachh bharat  narendra modi  indian celebrities  

Other Articles