Narendra modi speech all india radio mannki baat programme

narendra modi, mannki baat, all india radio, narendra modi all india radio, narendra modi mannki baat, narendra modi latest news, narendra modi news, narendra modi speech, narendra modi campaign

narendra modi speech all india radio mannki baat programme

మనసులో మాటను బయటపెట్టిన ప్రధాని మోడీ!

Posted: 10/03/2014 02:21 PM IST
Narendra modi speech all india radio mannki baat programme

ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడు చేపట్టని విధంగా ప్రధాని మోడీ రకరకాల కార్యక్రమాల ద్వారా నెటిజన్లతోపాటు గ్రామల్లో వున్న పేదప్రజలను సైతం ఆకర్షించడంలో సక్సెస్ సాధించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ట్విట్టర్‌లో మోడీ హవా కొనసాగుతున్న విషయం తెలిసిందే! ఇప్పుడు తాజాగా ఆయన ‘‘మన్ కీ బాత్ పేరిట’’ ఆల్ ఇండియా రేడియోలో ప్రసంగించి సరికొత్త ఒరవడికి నాంది పలికారు.

తొలిసారిగా ఇలా రేడియోలో ప్రసంగించిన మోడీ.. మొదట దేశప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా భారతీయులంతా దసరా జరుపుకోవడం ప్రతీతి అని పేర్కొన్నారు. రేడియో ద్వారా దేశంలోని మారుమూల కుగ్రామాలకు కూడా తన సందేశం అందుతుందని, అందుకే తాను ఈ మాధ్యమాన్ని ఎన్నుకున్నానని మోడీ చెప్పారు. దీంతో ఇకనుంచి రెండు వారాలకోసారి (ఆదివారంనాడు) రేడియోలో దేశప్రజలనుద్దేశించి ప్రసంగిస్తానని ఆయన స్పష్టం చేశారు. అలాగే స్వచ్ఛ్ భారత్ కార్యక్రమంలో దేశప్రజలందరూ పాల్గొనాలని మోడీ పిలుపునిచ్చారు.

ఈ నేపథ్యంలోనే ఆయన మాట్లాడుతూ.. ‘‘మన సామర్థ్యాన్ని మనం సరిగ్గా గుర్తించాలి. మనకు శక్తి లేక కాదు.. మనం శక్తిని మరిచిపోయాం. వివేకానంద స్ఫూర్తితో యువత ముందుకెళ్లాలి. మీ ఆలోచనలను సోషల్ మీడియా ద్వారా నాతో పంచుకోండి. దేశం కోసం ఉపయోగపడే మంచి సలహాలు, సూచనలు అందిస్తే..  వాటి నుంచి నేను కూడా స్ఫూర్తి పొంది, ఖచ్చితంగా వాటిని అమలుచేస్తాను. అందరూ కలిసి దేశాభివృద్ధికి పాటు పడదాం’’ అని మోడీ వ్యాఖ్యానించారు. పేదల శ్రేయస్సుకు ఉపయోగపడే ఖాదీ వస్త్రాలను, ఉత్పత్తులను కొనాలని ఆయన దేశప్రజలకు సూచించారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : narendra modi  all india radio  swacch bharat  mann ki baat programme  

Other Articles