Cm kcr talks about samagra kutumba survery

cm kcr, kcr latest news, kcr news, kcr comments, kcr samagra kutumba survey, kcr survey, telangana people, hyderabad city, telangana ministers

cm kcr talks about samagra kutumba survery

దొంగలెవరో.. దొరలెవరో దొరికిపోయారు! -కేసీఆర్

Posted: 10/03/2014 01:54 PM IST
Cm kcr talks about samagra kutumba survery

ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎష్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా కొన్ని నిజానిజాలు బయటపడ్డాయని సీఎం కేసీఆర్ తెలిపారు. ముఖ్యంగా ఈ సర్వేలో దొంగలెవరున్నారో.. దొరలెవరున్నారో అందరి విషయాలు బహిర్గమయ్యాయని ఆయన పేర్కొన్నారు. ఇందులో చాలావరకు భూములను కబ్జా చేసినవారి జాబితాలే ఎక్కువగా వున్నాయని ఆయన వెల్లడించారు.

శుక్రవారం బోయిగూడ ఐబీహెచ్ కాలనీలో 396 ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. సమగ్ర సర్వేలో వెల్లడైన విషయాలను తెలిపారు. నగరంలో లక్షలకోట్ల విలువైన భూములు కబ్జాకు గురయ్యాయని, కబ్జాకు గురైన భూములను వెనక్కు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇటువంటి నేరాలకు పాల్పడిన వారికి శిక్షలు కూడా తప్పవని ఆయన చెప్పకనే హెచ్చరికలు జారీ చేశారు.

అలాగే ఇళ్లులేనివారికి ఇళ్లు కట్టించి ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఏ బస్తీలోని ఏ బస్తీలోని ప్రజలకు ఆ బస్తీలోనే భవనాలు నిర్మించి ఇస్తామని తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్‌ను మురికివాడలు లేని నగరంగా తీర్చిదిద్దుతామని అన్నారు. ఇదిలావుండగా.. ఈ ఇళ్ల కార్యక్రమంలో మంత్రి పద్మారావు, ఎంపీ బండారు దత్తాత్రేయ, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kcr  samagra kutumba survey  hyderabad city  telangana ministers  

Other Articles