Bjp leader indrasena reddy on kcr

bjp, indrasena reddy, indra movie, bjp leaders, kcr, kcr comments, kcr leader, kcr house, kcr farm house, kcr family, kcr funny, kcr on telugu talli, kcr on andhra people, kcr on tankbund, hyderabad, tankbund, tankbund idols, demolish, packing, telangana, latest news

bjp leader indrasena reddy fires on telangana chief minister indrasena reddy says cm always tries to quarell with andhrapradesh : kcr has no vision on development only targeted andhrapradesh people says bjp leader indrasena reddy

కేసీఆర్ వి దిగజారుడు మాటలు

Posted: 09/29/2014 08:42 AM IST
Bjp leader indrasena reddy on kcr

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపి నేత నల్లు ఇంద్రసేనారెడ్డి మండిపడ్డారు. తెలుగుతల్లి ఎవరు? ఎవరికి పుట్టింది? అని ముఖ్యమంత్రి మాట్లాడటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు తల్లి ఎవరో.., ఎవరికి పుట్టిందో కేసీఆర్ కు తెలియదా.. ముఖ్యమంత్రి హోదాలోని వ్యక్తి ఇలా అసహ్యంగా మాట్లాడుతారా? అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ర్టాల్లో తెలుగు భాషనే మాట్లాడుతారని.., అటువంటి సందర్బంలో తెలుగుతల్లిపై విమర్శలు చేయటం ఎంతవరకు సమంజసమన్నారు.

 ప్రజా సమస్యల పరిష్కారం ఎలా అని ఆలోచించకుండా.., నిత్యం ఏదో ఒక వివాదంతో పబ్బం గడిపే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రోజూ ఏదో ఒక సమస్యను సృష్టించి ప్రజలను రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకున్నారని ద్వజమెత్తారు. రాష్ర్టంలో విద్యుత్, ఉద్యోగాలు, విద్యార్థుల ఫీజులు, రైతుల సమస్యలు.., ఇలా ఎన్ో ప్రజా సమస్యలు ఉండగా వాటి పరిష్కారంకు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. సమస్యలను పట్టించుకోకుండా.., కొత్త ఇబ్బందులను కొని తెచ్చుకుంటున్నారని దుయ్యబట్టారు ఎంత సేపు విమర్శించటం.., ఒక ప్రాంతం వారిని టార్గెట్ చేసి మాట్లాడటం తప్ప మరొకటి చేయటం లేదన్నారు.

ఇక ట్యాంకుబండ్ విగ్రహాలపై కూడా కేసీఆర్ కామెంట్లు వివాదాన్ని సృష్టించేలా ఉన్నాయన్నారు. ట్యాంక్ బండ్ పై కొన్ని పనికిమాలిన విగ్రహాలు ఉన్నాయని.., వాటిని ప్యాక్ చేసి పక్కరాష్ర్టానికి పంపిస్తామని దిగజారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కవులు, కళాకారులకు బాష, ప్రాంతంతో సంబంధం ఉండదనే విషయం మర్చిపోయి కేసీఆర్ మాట్లాడుతున్నారని విమర్శించారు. దిగజారుడు మాటలు, రెచ్చగొట్టే కామెంట్లు మానుకుని తెలంగాణ రాష్ర్ట అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kcr  indrasena reddy  telangana  telugu talli  

Other Articles