Modi comments in madison square

modi, narendra modi, narendra modi latest, modi gossips, latest news, narendra modi america tour, modi speech, andhrapradesh, telangana, central government, modi latest speech, modi newyork speech, uno, modi on pakisthan, mars, mangalyan, mom, isro, nasa, narendra modi speech in madison square, modi comments, modi on auto charge

indian prime minister narendra modi first speech attracts all indians and indian origins in america : narendra modi says auto charge is minimum 10rupees but india went to mars cheaper than a auto charge

ఆటో చార్జీ కంటే అంతరిక్షయానమే చవక

Posted: 09/29/2014 09:23 AM IST
Modi comments in madison square

అమెరికా పర్యటనలో భాగంగా న్యూయార్క్ లోని మాడిసన్ స్క్వేర్ లో ఆదివారం ప్రసంగించిన భారత ప్రధాని నరేంద్రమోడి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. మన దేశంలో ఆటో చార్జీల కంటే అంతరిక్షయానమే చాలా చవక అన్నారు. ఇందుకు ఆయన స్వయంగా ఉదాహరణ కూడా చెప్పారు. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఆటో చార్జి కిలోమీటర్ కు పది రూపాయలుగా ఉంటుంది. అయితే మంగళ్యాన్ ప్రయోగం ద్వారా మనం అంగారకుడిపైకి చేరుకోవడానికి కిలోమీటర్ కు ఏడు రూపాయలే ఖర్చు అయిందన్నారు.

తక్కువ ఖర్చులో లక్ష్యాలను సాధించిన ఘనత భారత్ దే అన్నారు. మంగళ్యాన్ విజయం ఖచ్చితంగా భారత శాస్ర్తవేత్తలది అని చెప్పారు. తొలి ప్రయత్నంలోనే అరుణ గ్రహంపైకి చేరుకోవటం మామూలు విషయం కాదన్నారు.  భారత్ అమెరికా ఇప్పుడు భూమిపైనే కాకుండా అంతరిక్షంలోనూ మాట్లాడుకుంటాయన్నారు. మామ్ విజయ యాత్రనుమోడి వివరిస్తూ ఉద్వేగానికి లోనయ్యారు. భారత్ సాధిస్తున్న విజయాలను పరిశీలిస్తే.. దేశానికి ఉన్న మేదో సంపత్తి ఏమిటో అర్ధం అవుతుందన్నారు.

ఇక దేశంలో తన ప్రభుత్వ పాలన తీరును ప్రవాసులకు వివరించారు. గత ప్రభుత్వాలు అనేక పనికిమాలిన చట్టాలు చేశాయి. కాలం చెల్లిన కొన్ని చట్టాలను అలాగే వదిలేశాయని వివరించారు. కాని ఎన్డీయే అధికారంలోకి వచ్చాక.., అవసరం లేని చట్టాలను తొలగిస్తున్నానని చెప్పారు. చట్టాలను చేయటం ఎంత కష్టమో.. వాటిని తొలగించటమూ అంతకంటే ఎక్కువ కష్టమన్నారు. ప్రజలకు ఉపయోగపడని చట్టాలను తీసేందుకు ఇబ్బందులు వస్తున్నా వాటిని అధిగమించి.. విజయం సాధించటంలో సంతోషం ఉంటుందన్నారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : narendra modi  newyork  mangalyan  auto charge  

Other Articles