Pakisthan pm nawaz sharif speech in uno

nawaz sharif, nawaz sharif wiki, nawaz sharif comments, nawaz sharif latest, nawaz sharif speech, nawaz sharif on india, nawaz sharif india tour, nawaz sharif latest, pmln, ppp abbrivations, ppp party, latest news, india, pakisthan, pakisthan people on india, india pakisthan war, uno, united nations organisations, uno permanent countries, narendra modi, modi us tour, modi america tour, obama

pakisthan prime minister nawaz sharif comments against india demand to add country as permenant member country of uno : nawaz sharif says no country should add as permenant in this situation, india is not fully interested to work with pakisthan

భారత్ పై మరోసారి విషం కక్కిన పాకిస్థాన్

Posted: 09/27/2014 08:26 AM IST
Pakisthan pm nawaz sharif speech in uno

పాకిస్థాన్ భారత్ పై మరోసారి విషం కక్కింది. ప్రపంచ దేశాల సమావేశాల వేదికగా తన అక్కసును వెల్లగక్కింది. భారత్ అభివృద్ధిని ఎంత వ్యతిరేకిస్తున్నారో ఆదేశ ప్రధాని ప్రకటించారు. ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో ప్రసంగించిన పక్కదేశ ప్రధాని ఉపఖండంపై నిలువెల్లా విషం నింపుకున్న వ్యక్తిగా మాట్లాడారు. ఇన్నాళ్లు కావాలనుకున్న స్నేహం, సోదర భావం అంతా ఉత్తిదే అన్నట్లుగా సమావేశాల్లో మాట్లాడారు. ఐక్యరాజ్య సమితిలో భారత్ కు శాశ్వత సభ్యత్వం కల్పించాలని డిమాండ్ ఉన్న నేపథ్యంలో.., దాన్ని వ్యతిరేకిస్తూ ప్రసంగం చదివారు.

షరీఫ్ ఏమన్నారంటే..

న్యూయార్క్ లో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి సర్వ సభ్య సమావేశాల్లో పాల్గొనేందుకు అన్ని దేశాల ప్రధానులు అమెరికాకు చేరుకున్నారు. ఈ సమావేశాల్లో ప్రసంగించిన పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్.., కొత్త దేశాలకు ఐ.రా.స. శాశ్వత మండలిలో సభ్యత్వం ఇవ్వకూడదన్నారు. ఇప్పటివరకు ఉన్న ఐదు దేశాలనే శాశ్వత సభ్యత్వ దేశాలుగా కొనసాగించాలన్నారు ( ప్రస్తుతం అమెరికా, బ్రిటన్, చైనా, రష్యా, ఫ్రాన్స్ దేశాలు శాశ్వత సభ్య దేశాలుగా ఉన్నాయి). అంటే భారత్ కు కూడా శాశ్వత హోదా కల్పించాలని డిమాండ్ ఉన్న నేపథ్యంలో దాన్ని పరోక్షంగా తోసిపుచ్చారన్నమాట.

 

 

అంతేకాకుండా కాశ్మిర్ అంశాన్ని కూడా షరీప్ ప్రస్తావించారు. భారత్ దురాక్రమణలో కాశ్మీరీలు ఉన్నారని చెప్పారు. కాశ్మీర్ సమస్య పరిష్కారం తమదేశానికి చాలా కీలకమన్నారు. కాశ్మీర్ ప్రజల ఆకాంక్షలు, మనోభావాలు ప్రపంచానికి తెలియాలంటే.., అక్కడ ప్లెబిసైట్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. అటు తాము శాంతియుత, స్నేహపూర్వక  వాతావరణం కోరుకుంటున్నా.., కొన్ని సార్లు భారత్ తమకు సహకారం అందించటం లేదన్నారు. ఓ సారి భారత్ కారణంగానే ఒక సమావేశం జరగలేదని చెప్పారు.

 


ఎందుకిలా అన్నారు..?

పాకిస్థానీలకు భారత్ అంటే కోపం అని చాలాసార్లు సర్వేలు తెలిపాయి. ఏకంగా పాకిస్థాన్ ఆర్మీనే ఉగ్రవాదులతో చేతులు కలిపి వారికి ఆయుధాలు, డబ్బు ఇచ్చి భారత్ పై దాడి చేయిస్తోందని మన ఇంటలిజెన్స్ ప్రకటించింది. అలాంటి వ్యక్తులు ఉన్న పాకిస్థాన్ లో నవాజ్ షరీఫ్ కాస్త సౌమ్యుడుగా పేరుపొందాడు. గతంలో ప్రధాని అయిన సమయంలోనూ.., అప్పటి భారత ప్రధాని వాజ్ పాయ్ తో చర్చలు జరిపారు. ప్రధాని అయ్యాక కూడా మన్మోహన్, మోడీతో షరీఫ్ ఇరుదేశాల సంబంధాల బలోపేతంపై చర్చలు జరిపారు. అయితే ప్రస్తుతం పాక్ లో షరీఫ్ కు వ్యతిరేక గాలి వీస్తోంది. ఆయన దిగిపోవాలని ఆందోళనలు జరుగుతున్నాయి.అటు పీపీపీ పార్టీ నేత బిలావల్ బుట్టో.., కాశ్మీర్ లో అంగుళం కూడా భారత్ కు చెందనివ్వమని ప్రకటించారు.

దీంతో ఆయన పాకిస్థాన్ దృష్టిలో హీరో అయ్యారు. ఇదే సమయంలో షరీఫ్ పై అక్కడి ప్రజల్లో కాస్త వ్యతిరేక భావన కల్గింది. దీంతో తాను కూడా భారత్ వ్యతిరేకి అన్పించుకునేందుకు ఇలా మాట్లాడారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో భారత్ పై పాక్ ప్రధాని మాటలయుద్దం మొదలుపెట్టారని చెప్తున్నారు. మరి ఈ కామెంట్లపై దేశ ప్రధాని మోడి ఎలా స్పందిస్తారో చూడాలి. దెబ్బకు దెబ్బ అన్నట్లు సమాధానం ఇస్తారా.. లేక భారత్ శాంతిదేశం అని చాటుతారా అని దేశ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : uno  modi  nawaz sharif  latest news  

Other Articles